అన్ని రంగాల్లో హైదరాబాద్ సమగ్రాభివృద్ధి
రామచంద్రాపురం(పటాన్‌చెరు): హైదరాబాద్ మహానగరాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేస్తామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. రామచంద్రాపురం డివిజన్ పరిధిలో రూ.40.70కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు బుధవారం ఆమె ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అభివృద్ధిలో హైదరాబాద్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉద్రిక్తత
రామచంద్రాపురం పట్టణంలో మేయర్ విజయలక్ష్మికి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన బీజేపీ నాయకులకు, స్థానికులకు మధ్య స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఒక వర్గానికి చెందిన సామాజిక భవనం కాకుండా అందరికీ ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరారు. అదే సమయంలో మరొక వర్గం వారు తమ భవ నాన్ని ఎలా అడ్డుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలకు నచ్చజెప్పి వారిని ఇళ్లకు పంపించి వేశారు.
నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి


