పుస్తకాలు రాయడం గొప్ప అలవాటు
ఎమ్మెల్యే హరీశ్ రావు
సిద్దిపేటజోన్: విద్యార్థి దశలోనే పుస్తకాలు రాయటం అనేది చాలా గొప్ప అలవాటని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో స్థానిక ప్రతిభ డిగ్రీ కళాశాల విద్యార్థి పొట్టి వెంకటేశ్ స్వయంగా రచించిన ఆధునిక కంప్యూటర్ వ్యవస్థలో వస్తున్న మార్పులకు సంబంధించిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ ఒకప్పుడు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వాళ్లను చాలా గొప్పగా చూసే వాళ్లని, కానీ నేడు మారుతున్న కాలానికి అనుగుణంగా కేవలం కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే మాత్రమే సరిపోదని అందులో మంచి జ్ఞానాన్ని సంపాదించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలను మన భారతీయులే ముందుండి నడిపించడం మన మన దేశానికే గర్వకారణమన్నారు. అనంతరం వెంకటేశ్ మాట్లాడుతూ పుస్తక రచనలో ప్రోత్సహించిన ప్రిన్సిపాల్ డాక్టర్ సూర్య ప్రకాశ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.


