పోస్టల్ బ్యాలెట్‌వినియోగించుకోండి
నారాయణఖేడ్: మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఖేడ్ మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ కోరారు. ఖేడ్ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసి గెజిటెడ్ ఆఫీసర్‌ను సైతం అందుబాటులో ఉంచామన్నారు. శుక్రవారం ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఆదివారం సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ఓటర్లున్న ప్రతీ ఇంటికీ పోల్ చీటీలు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందులో ఓటరు వివరాలు, పోలింగ్ కేంద్రం వివరాలు రాయడంలో తప్పులు లేకుండా చూసుకోవాలన్నారు. సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ రాజుపటేల్, బీఎల్‌వోలు పాల్గొన్నారు.
ఆవు లాంటోడిని..
కాపాడుకోండి: జగ్గారెడ్డి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: తాను రోజూ పాలిచ్చే ఆవు లాంటోడినని..తనను కాపాడుకోవాలని సంగారెడ్డి ప్రజలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి గంజి మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బహిరంగ సభకు ఆయన హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యేగా లేకపోయినప్పటికీ నియోజకవర్గం ప్రజల పనులు చేస్తున్నానని, ఇక ముందు కూడా చేస్తానని స్పష్టం చేశారు. ఇప్పటికే సర్టిఫికెట్లు జారీ చేసిన వారికి 80 గజాల చొప్పున అలియాబాద్‌లో ఇంటి స్థలం కేటాయించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటితో మాట్లాడానని చెప్పారు. ఒక్కో వార్డుకు రూ.8 కోట్ల చొప్పున సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.300 కోట్లు నిధులు మంజూరు చేయిస్తామన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీలోని కాంగ్రెస్ అభ్యర్థులందరిని గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్‌తోనేఅభివృద్ధి, సంక్షేమం: అజారుద్దీన్
తూప్రాన్: కాంగ్రెస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని మైనార్టీశాఖ మంత్రి అజారుద్దీన్ అన్నారు. శనివారం తూప్రాన్‌లో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొని మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. త్వరలోనే మహిళలకు మహాలక్ష్మి పథకం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. బీఆర్‌ఎస్ నాయకుల అధికార దాహాం తీరక కాంగ్రెస్‌పై బురద జల్లుతున్నారని విమర్శించారు. వారు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మె స్థితిలో లేరన్నారు. కేసీఆర్ సొంత కూతురే బీఆర్‌ఎస్‌లో జరిగిన అవినీతిని బయటపెట్టారని, అయినా వారికి బుద్ధి రావడం లేదన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సిద్ధిపేట ఎమ్మెల్యే అని, ఆయనకు గజ్వేల్ నియోజకవర్గంలో ఏం పని అని ప్రశ్నించారు. అనంతరం 1వ వార్డులో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాచారం దేవస్థానం చైర్మన్ రవీందర్‌గుప్త, నాయకులు మామిళ్ల కృష్ణ, భాస్కర్‌రెడ్డి, ఎలక్షన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు మల్లన్న నాల్గొవ వారం
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నాల్గొవ ఆదివారం భక్తులు భారీగా తరలిరానున్నారు. సంక్రాంతి తర్వాత వచ్చే సత్తేటి వారాల్లో నాల్గవ ఆదివారం కరీంనగర్, మెదక్, వరంగల్ ఉమ్మడి జిల్లాలతో పాటు నిజామాబాద్‌కు చెందిన భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం భక్తులు మల్లన్నకు పట్నం వేసి, బోనం సమర్పించడంతో పాటు అమ్మవార్లకు ఓడి బియ్యం, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకోనున్నారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ఆలయ అధికారులు సిద్ధం చేస్తున్నారు.
పోస్టల్ బ్యాలెట్‌వినియోగించుకోండి
పోస్టల్ బ్యాలెట్‌వినియోగించుకోండి


