కానిస్టేబుల్‌పై వేటు | - | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌పై వేటు

Feb 9 2026 8:54 AM | Updated on Feb 9 2026 8:54 AM

కానిస్టేబుల్‌పై వేటు

కానిస్టేబుల్‌పై వేటు

కొమురవెల్లి(సిద్దిపేట): విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కొమురవెల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ కె.రమేశ్‌ను సస్పెండ్‌ చేస్తూ ఆదివారం సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి, విఽధులకు గైర్హాజరయ్యారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రమేశ్‌ భార్య చేర్యాల మున్సిపల్‌ ఎన్నికల్లో 2వ వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తుండగా, ఆమెకు మద్దతుగా రమేశ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ఆధారాలతో సహా నిరూపితమైందన్నారు. ఒక బాధ్యతాయుతమైన పోలీస్‌ వ్యవస్థలో ఉంటూ, ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం రాష్ట్ర సివిల్‌ సర్వీసెస్‌ నియమావళి ప్రకారం నేరం, అనైతికమని తెలిపారు.

కానిస్టేబుల్‌ భార్య నిరసన..

చేర్యాల(సిద్దిపేట): పోలీస్‌ ఉద్యోగ నిబంధనలు ఉల్లంఘించాడని కొమురవెల్లి పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ రమేశ్‌ను సస్పెండ్‌ చేస్తూ సీపీ ఉత్తర్వులిచ్చారు. ఈ విషయంపై కానిస్టేబుల్‌ భార్య, స్థానిక 2వ వార్డు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గీతాంజలి స్పందిస్తూ తన భర్త సస్పెన్షన్‌ కక్షపూరిత చర్యగా వర్ణించారు. ఇదే విషయమై ఆమె ఆదివారం కుటుంబ సభ్యులు, తన మద్దతుదారులతో కలిసి అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement