నాడు తల్లి.. నేడు తండ్రి మృతి
అక్కన్నపేట(హుస్నాబాద్): సరిగ్గా ఏడాదిన్నర క్రితం తల్లి.. అనారోగ్యంతో శుక్రవారం తండ్రి మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలైన ఘటన పంతులు తండాలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కరంటోతు రాజు(45) అనే వ్యక్తి భార్య మృతిచెందడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురై మృతిచెందాడు. ఏడాదిన్నర క్రితం అక్కన్నపేట మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనలో తల్లి మృతి చెందారు. ఇద్దరూ మృతితో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. పిల్లలను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ లావుడియా రాజు నాయక్ ప్రభుత్వాన్ని కోరారు.
అనాథలైన పిల్లలు


