మారిన ప్రచార పంథా..
అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకం
చెట్టు కింద రచ్చబండ..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీల్లో 11 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కంటే ఆధిక్యం సాధించడంలో హరీశ్ కీలకంగా వ్యవహరించారు. పూర్తి మెజారిటీతో ఆరు మున్సిపాలిటీలను కై వసం చేసుకున్న గులాబీ పార్టీ.. హంగ్ ఫలితాలు వచ్చిన మరో ఐదు మున్సిపాలిటీల్లో ఆ పార్టీ ఎక్స్ అఫీషియో ఓట్ల (ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల) ఓట్లతో చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
ఈ సారి హరీశ్‌రావు తన ఎన్నికల ప్రచార పంథాను మార్చారు. ఆయా మున్సిపాలిటీలకు వెళ్లి చెట్ల రచ్చబండ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో మహిళలతో మమేకమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను సాధారణ మహిళా ఓటర్లకు అర్థమయ్యేలా తనదైన శైలిలో వివరించారు. మహిళా ఓటర్లను పేరు పెట్టి పిలుస్తూ వారికి మరింత దగ్గరవడంతో గులాబీ పార్టీ అభ్యర్థుల విజయంలో మహిళా ఓటింగ్ దోహదం చేసింది.
పక్కా ప్రణాళిక.. పకడ్బందీ వ్యూహాలను అమలు చేసిన హరీశ్‌రావు ఈ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించారు. ఆయా మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులను సమన్వయం చేసి అభ్యర్థులను ఎంపిక చేశారు. రెబల్స్‌గా బరిలోకి దిగిన ఆ పార్టీ నాయకులతో మాట్లాడి వారి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారు. మొత్తంగా మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు పకడ్బందీ వ్యూహాలను అమలు చేసి హరీశ్‌రావు గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఉమ్మడి మెదక్ జిల్లా గులాబీ పార్టీ పట్టు నిలుపుకున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.


