చికిత్స పొందుతూ ఇద్దరు మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ ఇద్దరు మృతి

Feb 16 2026 8:46 AM | Updated on Feb 16 2026 8:46 AM

చికిత

చికిత్స పొందుతూ ఇద్దరు మృతి

నర్సాపూర్‌ రూరల్‌: యువకుడు ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై రంజిత్‌ రెడ్డి వివరాల ప్రకారం... నర్సాపూర్‌ పట్టణానికి చెందిన వలేపు నవీన్‌(22) ప్రేమ విఫలం కావడంతో మనస్తాపానికి గురై జనవరి 18న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు నవీన్‌ను నర్సాపూర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. శనివారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మిరుదొడ్డిలో గుర్తు తెలియని వ్యక్తి..

మిరుదొడ్డి(దుబ్బాక): మతి స్థిమితం లేని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిరుదొడ్డి ఎస్‌ఐ సమత కథనం ప్రకారం... మండల పరిధిలోని ధర్మారం శివారులో జనవరి 31న గుర్తు తెలియని వ్యక్తిని బైక్‌ ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులతో సహా, గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి, తర్వాత మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు.

చికిత్స పొందుతూ ఇద్దరు మృతి 1
1/1

చికిత్స పొందుతూ ఇద్దరు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement