ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
సిద్దిపేటరూరల్: వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఇర్కోడ్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై రాజేశ్ వివరాల మేరకు... గ్రామానికి చెందిన బాలగోని సాయికుమార్ (39) నాలుగు రోజుల క్రితం కొత్తగా నిర్మిస్తున్న ఇంటివద్దకు వెళ్తున్నానని తండ్రికి చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన గ్రామస్తులు దుర్వాసన రావడంతో చెట్ల పొదల్లో గమనించగా, చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సాయికుమార్ నూతన ఇంటి నిర్మాణం చేపడుతున్నాడని, ఆర్థిక ఇబ్బందులతో మానసిక ఒత్తిడికి గురై ఉరివేసుకున్నాడని తెలిపారు. మృత్యుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.


