రగ్బీ పోటీలకు 8 మంది ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రగ్బీ పోటీలకు 8 మంది ఎంపిక

Feb 16 2026 8:46 AM | Updated on Feb 16 2026 8:46 AM

రగ్బీ

రగ్బీ పోటీలకు 8 మంది ఎంపిక

చేగుంట(తూప్రాన్‌): సౌత్‌జోన్‌ జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు జిల్లా నుంచి 8 మంది క్రీడాకారులు ఎంపికై నట్లు మెదక్‌ జిల్లా రగ్బీ అసోసియేషన్‌ అధ్యక్షుడు గణేశ్‌రవికుమార్‌ తెలిపారు. ఆదివారం సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన జిల్లా క్రీడాకారులు సబ్‌జూనియర్‌ విభాగంలో కల్పన, ఇందిర, అజ్మీరా, ప్రణవి, శ్రీలక్ష్మి, జూనియర్‌ విభాగంలో నవ్యశ్రీ, సీనియర్‌ విభాగంలో అనిత, నిఖిత జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు ఈనెల 21, 22న చైన్నెలోని నెహ్రూ స్టేడియంలో జరిగే రగ్బీ పోటీల్లో పాల్గొననున్నట్లు అసోసియేషన్‌ కార్యదర్శి మల్లీశ్వరీ తెలిపారు. వీరికి టీమ్‌ కోచ్‌లుగా మహేశ్‌, రంగీలా, కావేరి వ్యవహరించనున్నారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఐదుగురు..

వెల్దుర్తి(తూప్రాన్‌): ఈ నెల 20 నుంచి 23 వరకు గచ్చిబౌలిలో జరిగే రాష్ట్ర స్థాయి సీఎం కప్‌ అండర్‌ 14 ఫుట్‌బాల్‌ పోటీల్లో మెదక్‌ జిల్లా బాలుర జట్టుకు మాసాయిపేట గ్రామానికి చెందిన ఐదుగురు ఎంపికై నట్లు పాఠశాల పీడీ శ్యాంసుందర్‌శర్మ పేర్కొన్నారు. ఈ నెల 14న మెదక్‌లో జరిగిన జిల్లా జట్టు ఎంపికలో అవినాష్‌, అభిరామ్‌, అర్జున్‌, భాను ప్రసాద్‌, సాయి చరణ్‌ ఉత్తమ ప్రతిభ కనబర్చారు. దీంతో రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. వారితోపాటు కోచ్‌ శ్రీకాంత్‌ను సర్పంచ్‌ కిష్టారెడ్డి అభినందించారు.

రగ్బీ పోటీలకు 8 మంది ఎంపిక 1
1/1

రగ్బీ పోటీలకు 8 మంది ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement