ఆయిల్‌పామ్ మొక్కల ధ్వంసం
ఆయిల్ పామ్, మామిడి, ఉసిరి తదితర పంటలు సాగు చేస్తున్నాను. పొలంలోకి వచ్చిన అడవి పందులు 100 ఆయిల్ పామ్ మొక్కలతో పాటు మామిడి, ఉసిరి పంటలను పాడు చేశాయి. వాటి బారి నుంచి పంటను రక్షించుకునేందుకు పొలం చుట్టూ కందకాలు తవ్వించినా ధ్వంసం చేస్తున్నాయి. ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలి. – కిష్టన్న, రైతు, న్యాల్‌కల్
ఫిర్యాదు చేస్తే చర్యలు
అడవి జంతువులు పంటలను పాడుచేస్తే మాకు లేదా సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. రైతులు చేసిన ఫిర్యాదు మేరకు క్షేత్ర స్థాయిలో మా సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది పరిశీలించి పంట నష్టం వివరాలు పరిశీలిస్తారు. నివేదికలను ప్రభుత్వానికి పంపి రైతులకు పరిహారం అందేలా చూస్తాం.
– అరవిందర్‌రెడ్డి, జిల్లా ఫారెస్టు అధికారి, సంగారెడ్డి


