పంచాయతీ స్టార్టర్‌లో మంటలు
మసిరెడ్డి తండాలో ఘటన
అక్కన్నపేట(హుస్నాబాద్): ప్రమాదవశాత్తు బోరు మోటారు స్టార్టర్‌లో పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. ఈ ఘటన మండలంలోని మసిరెడ్డితండా గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం... ఇంటింటికి తాగునీరు అందించే పంచాయతీ బోరు మోటార్ స్టార్టర్‌లో విద్యుత్ తీగలు ఒకదానికి ఒకటి తాకి మంట లు వ్యాపించాయి. దీంతో తండావాసులు భయాందోళనకు గురయ్యారు. అయితే, ఇంటి మధ్యలో విద్యుత్ స్తంభానికి ఉన్న మంటల్లో స్టార్టర్ కాలిపోయింది. దీంతో సమీపంలో ఇంట్లో ఉన్న వారందరూ ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. కాలనీవాసులంతా అప్రమత్తంగా ఉండి మంటలు ఆర్పారు. దీంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పిందని తండావాసులంతా ఊపిరి పీల్చుకున్నారు.


