తేడా 4.90 | - | Sakshi
Sakshi News home page

తేడా 4.90

Feb 15 2026 12:36 PM | Updated on Feb 15 2026 12:36 PM

తేడా

తేడా 4.90

శాతమే

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : హోరాహోరీగా సాగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్ల శాతంలో తేడా స్వల్పంగానే ఉంది. జిల్లాలో అత్యధిక మున్సిపాలిటీలను కై వసం చేసుకున్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్య ఓట్ల తేడా కేవలం 4.90% ఉంది. ఈ ఎన్నికల్లో 11 మున్సిపాలిటీల్లో కలిపి అధికార కాంగ్రెస్‌కు 37.98%ఓట్లు రాగా, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌కు 33.08% ఓట్లు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. బీజేపీ 11.07% ఓట్లు సాధించింది. జిల్లాలో మొత్తం 3,18,118 ఓట్లు ఉండగా, ఇందులో 2,42,104 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్‌కు 91,956 ఓట్లు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ 80,112 ఓట్లు సాధించింది. బీజేపీకి 26,809 ఓట్లు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

నాలుగు.. రెండు..

మొత్తం 11 మున్సిపాలిటీలు ఉండగా కాంగ్రెస్‌ నాలుగు మున్సిపాలిటీలు సంగారెడ్డి, సదాశివపేట, అందోల్‌–జోగిపేట, నారాయణఖేడ్‌లలో స్పష్టమైన మెజారీటీ సాధించి చైర్మన్‌ పీఠాలను కై వసం చేసుకుంది. గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపా లిటీల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ పూర్తి మెజారిటీ సాధించింది. హంగ్‌ ఫలితాలు వచ్చిన ఇద్రేశం, ఇస్నాపూర్‌, జిన్నారం, జహీరాబాద్‌ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ కంటే బీఆర్‌ఎస్‌కే ఎక్కువ కౌన్సిలర్‌ స్థానాలను గెలుచుకోవడం గమనార్హం. కోహీర్‌లో మాత్రం హస్తం పార్టీనే పైచేయి సాధించింది.

ఎందుకు ఓడిపోయాం?

బల్దియా ఎన్నికలపై ఆయా పార్టీలు పోస్టుమార్టం చేసుకుంటున్నాయి. తమ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నాయి. ఆయా పార్టీలు ఓటమి పాలు కావడానికి ఏయే అంశాలు ప్రతికూలంగా మారాయనే అంశంపై లోతైన పరిశీలన చేసుకుంటున్నాయి. తిరుగుబాటు(రెబెల్స్‌) అభ్యర్థులే ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ ఓట్లకు గండి కొట్టినట్లు ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. జిల్లా కేంద్రం సంగారెడ్డి మున్సిపాలిటీనే ఉదాహరణగా తీసుకుంటే రెబెల్‌ అభ్యర్థులు గులాబీ పార్టీ అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌ ఓటమి పాలైన మున్సిపాలిటీల్లో నాయకత్వ సమస్య కొట్టొచ్చినట్లు కనిపించింది. బీజేపీ అభ్యర్థులను విజయతీరాలకు చేర్చడంలో ఆపార్టీ ముఖ్యనాయకత్వం ఆశించిన మేర చొరవ చూపలేదనే అభిప్రాయం కమలం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మొత్తంమీద రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం హవా కొనసాగితే.. సంగారెడ్డి జిల్లాలో మాత్రం బీఆర్‌ఎస్‌ తన పట్టును నిలుపుకుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్య ఓట్లు

ఫలితాలపై పార్టీల పంచనామా

తేడా 4.901
1/2

తేడా 4.90

తేడా 4.902
2/2

తేడా 4.90

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement