శత శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా
పదిలో శత శాతం ఉత్తీర్ణత సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని 249 ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేట్ పాఠశాలల్లోనూ ప్రాక్టీస్ టెస్టులు నిర్వహిస్తున్నాం. టెస్టులో ఏ విద్యార్థి ఎన్ని మార్కులు సాధించారనే సమాచారాన్ని పరిశీలించి, తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థికి మంచి మార్కులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం.
– వెంకటేశ్వర్లు, డీఈఓ–సంగారెడ్డి
న్యాల్‌కల్ (జహీరాబాద్)/ సంగారెడ్డి క్రైమ్: పదో తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభు త్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న ప్రభుత్వం వి ద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను సైతం అందజేసింది. విద్యార్థులు రాయనున్న వార్షిక పరీక్షల్లో వచ్చే ప్రశ్నపత్రాల నమూనా, పరీక్షల్లో పొరపాట్లు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, అధిక మార్కులు ఎలా పొందాలనే ఉద్దేశంతో ప్రాక్టీస్ టెస్టులకు శ్రీకారం చుట్టింది.
మార్చి 14 నుంచి టెన్త్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల సమయం కేవలం 30 రోజులు మాత్రమే ఉండటంతో విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖ అధికారులు దృష్టి సారించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు పొరపాట్లు చేయకుండా వాటిని సరిదిద్ది మంచి మార్కులు పొందేందుకు ప్రాక్టీస్ టెస్టులు నిర్వహిస్తున్నారు. గత నెల 29 నుంచి ఈ నెల 6 వరకు మొదటి ప్రాక్టీస్ టెస్టులు నిర్వహించారు. ఈ నెల 17 నుంచి 24 వరకు రెండవ విడత టెస్టులు నిర్వహించనున్నారు. అదేవిధంగా ఈ నెల 29 నుంచి మార్చి 10వ తేదీ వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. వార్షిక పరీక్షల్లో ప్రశ్న పత్రాలు ఎలా వస్తాయి? వాటికి జవాబులు ఎలా రాయాలి? అనే విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రస్తుతం టెస్టులు నిర్వహిస్తున్నారు. టెస్టుల్లో ప్రశ్న పత్రాలు ఎలా వస్తాయో వార్షిక పరీక్షల్లో కూడా అలాగే వస్తాయని ఉపాధ్యాయులు తెలిపారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న టెస్టుల్లో విద్యార్థులు ఎక్కడ పొరపాట్లు చేస్తున్నారు? ఎక్కడ మార్కులు తగ్గాయి? చేసిన పొరపాట్లు మళ్లీ చేయకుండా ఉండేందుకు వారికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. నిర్వహించిన టెస్టుల్లో విద్యార్థులు పొందిన మార్కులను జిల్లా అధికారులకు పంపిస్తున్నామన్నారు. వీటిపై విద్యార్థులు దృష్టి సారిస్తే పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవచ్చునని వారు పేర్కొంటున్నారు.
జిల్లాలో 249 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలున్నాయి. వాటిలో 12,394 మంది విద్యార్థులు 10వ తరగతి చదువుతున్నారు. పదిలో 100% ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా వారికి స్టడీ మెటీరియల్ అందించి, అక్టోబర్ 7న ప్రత్యేక తరగతులను ప్రారంభించింది. రెగ్యులర్ తరగతులతో పాటు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం గంట చొప్పున రెండు పూటలా ప్రత్యేక తరగతులను నిర్వహిస్తుంది.
ఒత్తిడిని దూరం చేసేందుకు చర్యలు
శతశాతం కోసమే
ప్రతీ సబ్జెక్టుపై అవగాహన
విద్యార్థులు పరీక్షలపై భయం వీడాలి. ప్రణాళికతో చదివితే సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించవచ్చు. గణితంలో మంచి మార్కులు సాధించాలంటే సూత్రాలపై ఉచితంగా పట్టు అవసరం. పాఠశాలల్లో విద్యార్థులకు ప్రతీ రోజు ఒక్కో సబ్జెక్టుపై ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు,పరీక్షలు నిర్వహిస్తున్నాం.
– శోభారాణి, ప్రభుత్వ బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ సంగారెడ్డి
ప్రాక్టీస్ టెస్టులు
ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
వరుసగా ప్రాక్టీస్ టెస్టుల నిర్వహణ
మార్చి 14 నుంచి టెన్త్ వార్షిక పరీక్షలు
పదో తరగతి విద్యార్థులు మొట్టమొదటి పబ్లిక్ పరీక్షలు ఎదుర్కొంటున్న సమయంలో కాస్త భయంతో ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. దీంతో విద్యార్థుల్లో ఒత్తిడి భయం పోగొట్టేలా మానసిక వైద్యులు కౌన్సిలింగ్ కల్పిస్తున్నారు. ఏడాదిలో జిల్లా వ్యాప్తంగా 522 పాఠశాలల్లో 27816 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయన్నట్లు అధికారులు తెలిపారు.
అక్టోబర్ నుంచే ప్రత్యేక తరగతులు
1/1
శత శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా