రాష్ట్ర స్థాయి పోటీలకు 15 మంది ఎంపిక
ముగిసిన జిల్లా స్థాయి యోగాసన పోటీలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): యోగాసన పోటీల్లో పలువురు రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట అశోక్ తెలిపారు. జిల్లా యువజన క్రీడా శాఖ, జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని షిర్డీ సాయిబాబా ఆలయ ఆవరణలో సీఎం కప్ యోగా సెలక్షన్స్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. ఎవరైతే యోగా సాధనకు దగ్గరుంటారో వారు ఆరోగ్యంగా ఉంటారని, చదువుల్లో, అన్ని రంగాల్లో వికసిస్తారన్నారు. కాగా రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు 15 మంది ఎంపికయ్యారుని తెలిపారు. జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, ప్రముఖ యోగా శిక్షకురాలు సంధ్య, న్యాయ నిర్ణీతలుగా రాజ్‌కుమార్, శ్రీనివాస్ , సంధ్య, కిషన్, శ్రీ ప్రసన్న, వ్యాయామ ఉపాధ్యాయులు, సభ్యులు పాల్గొన్నారు.


