తమ్ముడి దశ దినకర్మ రోజే.. | - | Sakshi
Sakshi News home page

తమ్ముడి దశ దినకర్మ రోజే..

Feb 15 2026 12:36 PM | Updated on Feb 15 2026 12:36 PM

తమ్ముడి దశ దినకర్మ రోజే..

తమ్ముడి దశ దినకర్మ రోజే..

అన్నకు గుండెపోటు.. మృతి

శివ్వంపేట(నర్సాపూర్‌): తమ్ముడి దశ దినకర్మ రోజే అన్న మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వికలాంగుడైన ఇసుగారి లక్ష్మయ్య పది రోజుల క్రితం బాత్రూంలో జారిపడి బ్రెయిన్‌డెడ్‌తో మృతి చెందాడు. శనివారం లక్ష్మయ్య దశ దినకర్మ ఏర్పాట్లలో కుటుంబ సభ్యులు, బంధువులు నిమగ్నమయ్యారు. ఇంతలోనే లక్ష్మయ్య సోదరుడు భిక్షపతి ఉదయం గుండెపోటుకు గురై మృతి చెందాడు. పది రోజుల వ్యవధిలోనే తమ్ముడు, అన్న మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దశ దినకర్మకు వచ్చిన బంధువులు అంత్యక్రియలకు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement