కారు బోల్తాపడి ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

కారు బోల్తాపడి ఒకరు మృతి

Feb 15 2026 12:36 PM | Updated on Feb 15 2026 12:36 PM

కారు బోల్తాపడి ఒకరు మృతి

కారు బోల్తాపడి ఒకరు మృతి

ముగ్గురికి స్వల్ప గాయాలు

పటాన్‌చెరు టౌన్‌: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మహేశ్వర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఇంద్రేశం మున్సిపాలిటీకి చెందిన ముజీబుద్దీన్‌ (29) వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున స్నేహితులు షేక్‌ అస్లాం, చంద్రశేఖర్‌, నిత్యానంద్‌తో కలిసి ఇంద్రేశం నుంచి ఇస్నాపూ ర్‌కు కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో పోచారం సమీపంలోని నక్క వాగు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ముజీబుద్దీన్‌ తీవ్రంగా గాయపడగా, మిగతా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా ముజీబుద్దీన్‌ మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement