అవమానం భరించలేక భర్త ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అవమానం భరించలేక భర్త ఆత్మహత్య

Feb 15 2026 12:36 PM | Updated on Feb 15 2026 12:36 PM

అవమాన

అవమానం భరించలేక భర్త ఆత్మహత్య

భార్య దాడి.. సహకరించిన ఆమె సోదరులు

నారాయణఖేడ్‌: భార్య, ఆమె సోదరులు కలిసి దాడి చేయడంతో అవమానం భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్‌లో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం... ఖేడ్‌ మండలం పీర్లతండాకు చెందిన వంక్లోత్‌ రమేశ్‌(36)కు 11ఏళ్ల కింద వివాహమైంది. ఇద్దరు కుమారులు, కూతురు సంతానం. కొంత కాలంగా ఖేడ్‌ పట్టణంలోని ఏఎస్‌నగర్‌ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటూ లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొద్ది రోజులుగా భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్నదని అనుమానించి ప్రశ్నించాడు. దీంతో అతడి భార్య తన సోదరులను పిలిపించి శుక్రవారం రాత్రి భర్త రమేశ్‌పై దాడి చేశారు. మనస్తాపానికి గురైన రమేశ్‌ అద్దె ఇంట్లో ఉరివేసుకున్నాడు. మృతుడి తల్లి సంతుబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా రమేశ్‌ను అతడి భార్య, ఆమె సోదరులు హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతుడి సోదరులు, కుటుంబీకులు, బంధువులు ఆరోపించారు.

కూలిన స్వాగత తోరణం

కూలీలకు గాయాలు

చేర్యాల(సిద్దిపేట): స్వాగత తోరణం కూలి నలుగురు కూలీలకు గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని కొత్తదొమ్మాట గ్రామశివారులో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... గ్రామస్తుల ఆధ్వర్యంలో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ స్వాగత తోరణ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన కర్రలు కూలడంతో అక్కడ పనులు చేస్తున్న నలుగురు కూలీలు గాయాలపాలయ్యారు. వారిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

అవమానం భరించలేక భర్త ఆత్మహత్య1
1/1

అవమానం భరించలేక భర్త ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement