హెల్ప్‌డెస్క్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ
కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ కలెక్టరేట్: మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రజల నుంచి హెల్ప్‌డెస్క్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు అందరూ ఎన్నికల విధుల్లో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమం వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు.
బైకు ఢీకొని మహిళ మృతి
కంది(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండల కేంద్రమైన కంది–బెంగళూరు బైపాస్ రోడ్డులో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి కథనం ప్రకారం... కంది తండాకు చెందిన విస్లావత్ మాలిబాయి (50) ఆదివారం సాయంత్రం మేకలను మేపుకొని ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా కాశీపూర్ వైపు నుంచి వచ్చిన బైకు మాలిబాయిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ నడుపుతున్న యువకుడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అతని వివరాలు తెలియరాలేదు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


