టీచర్‌కు గురుదేవోభవ సేవ పురస్కారం
చేగుంట(తూప్రాన్)/వెల్దుర్తి(తూప్రాన్): మాసాయిపేట మండలం చెట్లతిమ్మాయిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు డాక్టర్ స్వప్నశ్రీ ఆదివారం గురుదేవోభవ సేవ పురస్కారం అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్, విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్సిటీలో గురుదేవోభవ ట్రస్టు ఆధ్వర్యంలో సేవ పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు. టీచర్ స్పప్నశ్రీ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తించి ట్రస్టు చైర్మన్ మాజీమంత్రి యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ అవార్డు అందజేశారు. ఆమె అవార్డు అందుకోవడంపై సర్పంచు మనోహర్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
కల్వర్టులోకి దూసుకెళ్లిన కారు
నిజాంపేట(మెదక్): కారు అదుపుతప్పి కల్వర్టులోకి దూసుకెళ్లింది. స్థానికుల వివరాల ప్రకారం... మండల పరిధిలోని నందిగామ గ్రామ శివారులోని ఎన్‌హెచ్ 765 డిజి రోడ్డులో గతంలో కురిసిన భారీ వర్షాలకు వంతెన కుంగడంతో అధికారులు అక్కడ తాత్కాలిక రోడ్డు వేశారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి కారు సిద్దిపేట నుంచి మెదక్‌కు వెళ్తుండగా అదుపు తప్పి కల్వర్టులోకి దూసుకెళ్లింది. అందులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమా దం జరగలేదు. నెలలోనే వరుసగా నాలుగు ప్రమాదాలు జరిగాయని, అధికారులు రోడ్డు ను నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
టీచర్‌కు గురుదేవోభవ సేవ పురస్కారం


