క్రికెట్‌ చాంపియన్‌ కరీంనగర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ చాంపియన్‌ కరీంనగర్‌

Feb 15 2026 12:36 PM | Updated on Feb 15 2026 12:36 PM

క్రికెట్‌ చాంపియన్‌ కరీంనగర్‌

క్రికెట్‌ చాంపియన్‌ కరీంనగర్‌

రన్నరప్‌ మెదక్‌

వరంగల్‌ స్పోర్ట్స్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వరంగల్‌ కేంద్రంగా వారం రోజులపాటు నిర్వహించిన అండర్‌–19 క్రికెట్‌ పోటీల్లో కరీంనగర్‌ జట్టు చాంపియన్‌గా నిలిచింది. కరుణాపురం సమీపం వంగాలపల్లిలోని వరంగల్‌ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ క్రీడా మైదానంలో శనివారం ఫైనల్‌ పోటీలు నిర్వహించారు. కరీంనగర్‌ , మెదక్‌ జట్ల మధ్య నిర్వహించిన పోరులో.. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న కరీంనగర్‌ నిర్ణీత 50 ఓవర్లకు 39.5 ఓవర్లు ఎదుర్కొని 260 పరుగులు సాధించింది. కరీంనగర్‌ జట్టులో బ్యాట్స్‌మెన్‌ తక్షిల్‌ 104 బంతులు ఎదుర్కొని 145 పరుగులు సాధించగా, మెదక్‌ బౌలర్‌ హిషాంత్‌ 4 వికెట్లతో రాణించాడు. అనంతరం బరిలోకి దిగిన మెదక్‌ జట్టు 29.5 ఓవర్లు ఎదుర్కొని 153 పరుగులు సాధించి అన్ని వికెట్లను కోల్పోయింది. దీంతో కరీంనగర్‌ జట్టు 108 పరుగుల తేడాతో విజయం సాధించింది. మెదక్‌ బ్యాట్స్‌మెన్‌ విఘ్నేశ్‌ 36 పరుగులతో రాణించాడు. కాగా వరంగల్‌ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమానికి సీనియర్‌ క్రీడాకారుడు శరత్‌చంద్ర ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్‌ జిల్లా క్రికెట్‌ ప్రతినిధి మనోహర్‌రావు, మెదక్‌ కార్యదర్శి రాజేంద్రరెడ్డి, మార్నేని ఉదయభానురావు, కుమార్‌, బండారి ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement