breaking news
disclaimer
-
హోటల్లో భోంచేసి, మిగిలిన ఫుడ్ తెచ్చుకుంటున్నారా? ఇది మీ కోసమే!
ఏదైనా హోటల్‌కు వెళ్లినపుడు మనం ఆర్డర్ చేసిన ఫుడ్మిగిలిపోతే ప్యాక్ చేయించుకొని ఇంటికి తెచ్చుకోవడం చాలామందికి అలవాటే కదా. అయితే ఒక స్టార్హోట్లో జరిగిన ఒక సంఘటన నెట్టింట నవ్వులు పూయిస్తోంది. అంతేకాదు ఆహార భద్రత, హోటల్ బాధ్యతలపై నెటిజన్ల మధ్య తీవ్ర చర్చ నడుస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..ఐటీసీ మరాఠా (ముంబై) హోటల్‌కి వెళ్లిన ఒక కస్టమర్ అనుభవాన్ని ఎక్స్‌లో షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. గౌరవ్ సబ్నిస్ అనే ఎక్స్ యూజర్ షేర్ చేసిన వివరాల ప్రకారం మిగిలిపోయిన ఆహారాన్ని (లెఫ్టోవర్స్) ఇంటికి తీసుకెళ్లడానికి ఒక కస్టమర్‌ను లీగల్ డిస్క్లైమర్పై సంతకం చేయమని చెప్పడం గమనార్హం. ఈ పోస్ట్‌తో పాటు ఆ డిస్క్లైమర్ ఫారమ్ ఫోటోను కూడా జత చేస్తూ, ఇది చాలా విచిత్రంగా ఉందని గౌరవ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: వందే భారత్‌లో నాన్న ఫస్ట్ రైడ్... ఓ పుత్రుడి ఎమోషనల్ స్టోరీA friend had dinner at ITC Maratha and asked them to pack leftovers to go and they made him sign a disclaimer that the food will be eaten within 2 hours or discarded! Hilariously bizarre! pic.twitter.com/tgXRrVT3n5— Gaurav Sabnis (@gauravsabnis) July 21, 2026డిస్క్లైమర్ ఫారమ్‌లో ఏ ముందంటే...రిస్క్ కస్టమర్‌దే : ఈ సౌకర్యం కేవలం 'ఆ లా కార్ట్' (À la carte) మెనూ ద్వారా ఆర్డర్ చేసిన ఫ్రెష్ ఆహారానికి మాత్రమే వర్తిస్తుంది. బఫే ఆహారానికి ఇది వర్తించదు. అలాగే ప్యాక్ చేసిన ఆహారాన్ని 2 గంటల్లోపు తినాలి, లేదా పడేయాలి. ఆహారం హోటల్ ప్రాంగణం దాటిన తర్వాత దానిని ఎలా రవాణా చేస్తారు లేదా నిల్వ చేస్తారనే దానిపై హోటల్‌కు ఎలాంటి నియంత్రణ ఉండదు. కాబట్టి దాని భద్రతకు హోటల్ హామీ ఇవ్వదు. ఆహారం తిన్న తర్వాత ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే దానికి ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ గానీ, వారి యాజమాన్యం గానీ బాధ్యత వహించవని స్పష్టం చేశారు. అంతేకాదు పార్శిల్ తీసుకెళ్లే ముందు కస్టమర్ తమ పేరు, చిరునామా, తేదీ, సమయం, సంతకం పూర్తి చేయాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: 30 ఏళ్ల క్రితం పేపర్ లీక్‌పై పోరు, ఎముకలు విరిగాయ్ : ఈయన్ని గుర్తు పట్టారా?నెటిజన్ల స్పందనఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇది చాలా తెలివైన నిర్ణయమని, హోటల్ తన బ్రాండ్ పేరు దెబ్బతినకుండా ఉండేందుకు తీసుకున్న ముందస్తు జాగ్రత్త అని కొందరు అభిప్రాయపడ్డారు. వండిన ఆహారంలో బ్యాక్టీరియా త్వరగా చేరే అవకాశం ఉంది. సరిగ్గా నిల్వ చేయకుండా కొన్ని గంటల తర్వాత తిని పుడ్ పాయిజన్ అయితే హోటల్‌ను నిందించడం సరికాదని కొందరు పేర్కొన్నారు. వేరే స్టార్ హోటళ్లలో కూడా ఇలాంటి నియమాలు ఉన్నాయని, బయటి నుండి తెచ్చుకునే ఆహారానికి కూడా కొన్ని హోటళ్లు ఫారమ్‌లు నింపిస్తాయని మరికొందరు తన అనుభవాన్ని గుర్తుచేశారు. హోటల్ తీరుపై స్పందిస్తూ, ఇంకా నయం.. గుర్తింపు కోసం ఆధార్ సంఖ్యను అడగలేదు అంటూ నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశారు.ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి -
డిస్క్లెయిమర్లో హడావుడి వద్దు ! ప్రకటనలపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
ముంబై: టీవీ చానళ్లలో మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చే ప్రకటనల్లో కీలకమైన సున్నిత సమాచారానికీ అంతే ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రకటన ముందు భాగంలో ఉన్న మాదిరే, చివర్లో కీలక సమాచార వెల్లడికీ ఒకటే వేగం ఉండాలని అభిప్రాయపడ్డారు. అవసరమైతే రూ.37 లక్షల కోట్ల మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ దీన్ని పాటించేలా నిబంధనల్లో సవరణలు తీసుకొస్తామన్నారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ గోయల్ పర్యవేక్షణలోనే ఉంది. మ్యూచువల్ ఫండ్ ప్రకటన చివర్లో కచ్చితంగా వెల్లడించాల్సిన డిస్‌క్లెయిమర్‌ను చాలా వేగంగా చదవడం గమనించొచ్చు. దీనిపైనే మంత్రి స్పందించారు. ‘‘డిస్ క్లెయిమర్ (తమకు బాధ్యతలేదన్న విషయాన్ని వెల్లడించడం)ను చాలా చాలా వేగంగా చదువుతున్నారు. అలా అయితే దాన్ని అర్థం చేసుకోవడం కష్టం. ప్రకటనలో ముందు భాగం ఎంత వేగంతో నడిచిందో డిస్‌క్లెయిమర్ కూడా అలాగే నడవాలి. వేగంగా చదివి దాని ఉద్దేశ్యాన్ని నీరుగార్చకూడదు’’ అని ఎన్ఎస్ఈ కార్యక్రమంలో మంత్రి వివరించారు. చదవండి: Fund Review: మిరే అస్సెట్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ -
అవసరమైతే ‘సుప్రీం’కెళతా అనురాగ్ కశ్యప్
ముంబై: ‘అగ్లీ’ సినిమాలో పొగ తాగే దృశ్యం వచ్చినపుడు ‘సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్’ ప్రకటన (డిస్‌క్లెయిమర్) వేయనని చెప్పినప్పటికీ సెన్సార్ బోర్డు అభ్యంతరంపై తుదివరకు పోరాడతానని దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ పేర్కొన్నాడు. అవసరమైతే సుప్రీంకోర్టుదాకా వెళతానన్నాడు. అటువంటి డిస్క్లెయిమర్లతో సినిమాను విడుదల చేసేందుకు తాను సిద్ధంగా లేనన్నాడు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికెటేషన్ను సవాలుచేస్తూ అనురాగ్... బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ‘అది అసలు సమంజసం కాదనేది నా భావన. ఇది పూర్తిగా మతి లేని చర్య. నా విన్నపాన్ని బాంబే హైకోర్టు ఆలకించకపోతే సుప్రీంకోర్టుకు వెళతా’ అని తెలిపాడు. దర్ మోషన్ పిక్చర్స్, ఫాంటం ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన అగ్లీ సినిమా వాస్తవానికి ఈ ఏడాది అక్టోబర్ 11వ తేదీనే విడుదల కావాల్సిఉంది. అయితే డిస్క్లెయిమర్లు వేసేందుకు అనురాగ్ అంగీకరించకపోవడంతో వచ్చే సంవత్సరానికి వాయిదాపడింది. ‘అటువంటి ప్రకటనలతో ఈ సినిమాను విడుదల చేయడం నాకు ఇష్టం లేదు. కడదాకా పోరాడతా. నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అధికారం నాకు ఉంది. నా సినిమాలు నేను తీసుకుంటా. తీర్పు ఏవిధంగా వచ్చినా ఫర్వాలేదు. ప్రజాస్వామ్య దేశం అయినందువల్ల పోరాటాన్ని కొనసాగిస్తా. ఎందుచేతనంటే ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు ఎదురొడ్డి నిలబడాల్సిందే. పోరాటం జరపాల్సిందే. అటువంటి డిస్క్లెయిమర్లు ఎవరికైనా అవమానకరంగానే అనిపిస్తుంద’ని ‘గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్’, ‘దేవ్ డి’, ‘గులాల్’, ‘నో స్మోకింగ్’ తదితర సినిమాలతో బాలీవుడ్లో తళుక్కుమన్న అనురాగ్ చెప్పాడు.


