జీవీ ప్రకాశ్ గొప్ప మనసు.. వైద్యానికి సాయం | GV Prakash Kumar Wins Hearts By Helping Fan In Medical Emergency, Donates ₹50,000 On Social Media Appeal | Sakshi
Sakshi News home page

GV Prakash kumar: జీవీ ప్రకాశ్ గొప్ప మనసు.. ఆపదలో సాయం

Jun 17 2026 10:56 AM | Updated on Jun 17 2026 12:14 PM

GV Prakash kumar donates Rs 50000 for medical emergency

కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్‌ తన గొప్ప మనసు చాటుకున్నారు. ఆపదలో ఉన్న ఓ వ్యక్తిక అండగా నిలిచారు. వైద్య ఖర్చుల కోసం తన స్నేహితుడికి సాయం చేయాలని ఓ నెటిజన్ ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన జీవీ ప్రకాశ్ తన తరఫున చిన్న సాయం అంటూ రూ.50 వేలు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ జీవీ ప్రకాశ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్‌ టాలీవుడ్‌ మూవీకి సంగీమందించనున్నారు. ‍అనిల్ రావిపూడి- వెంకీ కాంబోలో వస్తోన్న చిత్రానికి పని చేయనున్నారు. ఇటీవలే ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. రోటీన్‌కు భిన్నంగా బీచ్‌లో మ్యూజిక్ కొడుతూ అనౌన్స్ చేశారు. ఇందులో కూడా అనిల్ రావిపూడి తనలోని క్రియేటివిటీని చూపించారు. ఈ సినిమాకు అనంత శ్రీరామ్ లిరిసిస్ట్‌గా పని చేయనున్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement