మరో స్టార్ పొలిటికల్ ఎంట్రీ.. క్యూ కడుతున్నారుగా..! | GV Prakash Kumar Hints At Political Entry After Films, Says Public Service Is His Future Goal, More Details Inside | Sakshi
Sakshi News home page

మరో స్టార్ పొలిటికల్ ఎంట్రీ.. క్యూ కడుతున్నారుగా..!

Jun 16 2026 11:47 AM | Updated on Jun 16 2026 12:03 PM

GV Prakash Kumar interesting comments On political entry in tamilnadu

కోలీవుడ్‌ స్టార్స్ సినిమాలతో పాటు పాలిటిక్స్ వైపు దూసుకెళ్తున్నారు. తమిళనాట కొత్త పార్టీ పెట్టిన దళపతి విజయ్ ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే సీఎం ‍అయ్యారు. అదే స్ఫూర్తితో రాఘవ లారెన్స్ సైతం రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందని క్లారిటీ ఇచ్చేశారు. ఎప్పుడనేది మాత్రం సస్పెన్స్ కొనసాగించారు. విజయ్‌ పార్టీలో చేరతారా? లేదా అన్నదానిపై రాబోయే రోజుల్లో తెలియనుంది.

ఇదిలా ఉండగానే మరో స్టార్‌ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. హీరోగా, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎదిగిన జీవీ ప్రకాశ్ కుమార్‌ రాజకీయాల్లోకి రావడంపై క్లారిటీ ఇచ్చారు. సినీ ప్రయాణం ఇంకో 15 ఏళ్లు కొనసాగుతుందో లేదో చెప్పలేనని జీవీ ప్రకాశ్ అన్నారు. ఆ తర్వాత తాను ప్రజాసేవపైనే దృష్టి పెడతానని కీలక వ్యాఖ్యలు చేశారు. నా ఆలోచనలకు సరిపోయే వేదిక దొరికితే కలిసి పనిచేయడానికి సిద్ధమని తెలిపారు. ఈ ప్రకటనతో భవిష్యత్తులో తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమని హింట్‌ ఇచ్చారు జీవీ ప్రకాశ్. తాజా ఇంటర్వ‍్వూలో ఈ కామెంట్స్ చేశారు.

ఇటీవలే రాఘవ లారన్స్, రజినీకాంత్ అల్లుడు లాంటి వాళ్లు రాజకీయాల్లోకి వస్తున్నారని వార్తలొచ్చాయి. లారెన్స్ ఇ‍ప్పటికే ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ సైతం తన పొలిటికల్ ఎంట్రీ సంకేతాలిచ్చారు. ఇదంతా చూస్తుంటే కోలీవుడ్ ఇండస్ట్రీ సినిమాల కంటే ఎక్కువగా రాజకీయాల వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో సినీ ఇండస్ట్రీ.. తమిళనాట రాజకీయాలను శాసించనుందా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement