ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ లీలాప్రసాద్ నియామకం
న్యూస్‌రీల్
బ్యాంకుల నుంచి క్లియరెన్స్ ఇప్పించడంలో నిర్లక్ష్యం
దుర్గమ్మ సేవలో ప్రద్యుమ్న
బుధవారం శ్రీ 4 శ్రీ మార్చి శ్రీ 2026
ఎండీయూ వాహనం..
● ఎండీయూ వాహనాలను నిలిపివేసిన చంద్రబాబు ప్రభుత్వం
● ఉపాధి కోల్పోయి అల్లాడుతున్న
వాహనాల ఆపరేటర్లు
● వాహనాల ఆపరేటర్లకు భారంగా మారిన రుణాల చెల్లింపు
7
జి.కొండూరు: పేదల ఇళ్ల వద్దకే నిత్యావసర సరుకులను చేరవేసే ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వాహనాలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ వాహనాల వల్లే రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపణలు చేసింది. ఈ వాహనాలను నిలిపివేసిన ప్రభుత్వం రేషన్ సరుకుల పంపిణీని తిరిగి డీలర్లకు అప్పగించింది. వాహనాలను రద్దు చేసినప్పుడు వాటి రుణాల బకాయిలను వెంటనే క్లియర్ చేసి వాహనాల ఆపరే టర్లకు క్లియరెన్స్ లెటర్లు ఇప్పిస్తామంటూ హామీ ఇచ్చింది. రుణాలు తీరిపోతే వాహనం ఆపరేటర్ల సొంతమై వారు ఇతర వ్యాపారాలకు వినియోగించుకునే వీలు కల్పిస్తున్నట్లు గొప్పల డప్పుకొట్టింది. అయితే వాహనాలను తొలగించి తొమ్మిది నెలలు గడిచినా రుణాల క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో వాహనాలను వినియోగించని ఆపరేటర్లు, వాటిని విక్రయించే వీలు లేక లబోదిబోమంటున్నారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ గడువు కూడా ముగియడంతో రెన్యూవల్ చేయించలేక సతమతం అవుతున్నారు. వాహనాలను తొలగించే ముందు రెండు విడతలు ఐసీడీఎస్, ఏఎండీలకు రేషన్ సరఫరా చేసిన కమీషన్‌కు సైతం రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది. వాహనాలను తొలగించాకే రేషన్ మాఫియాకు రెక్కలొచ్చాయని ఎండీయూ ఆపరేటర్ల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రేషన్ పంపిణీ వాహనాలను గత ఏడాది మే నెలలో తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క వాహనంపై అప్పటి వరకు మిగిలి ఉన్న బ్యాంకు రుణం బకాయి రూ.1.5 లక్షలను ప్రభుత్వం ఒక్కసారిగా చెల్లించి ఉంటే బ్యాంకుల నుంచి క్లియరెన్స్ వచ్చి వాహనం ఆపరేటర్ల సొంతమయ్యేది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయకుండా నెలవారీ వాయిదాలు చెల్లిస్తుండడంతో బ్యాంకుల నుంచి క్లియరెన్స్ రాలేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఈ వాయిదాలు చెల్లించాల్సి ఉండటంతో వాహనా లకు క్లియరెన్స్ రావాలంటే ఆపరేటర్లు మరో ఏడాది పాటు వేచి ఉండక తప్పదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎండీయూ వాహనాలకు వాహన మిత్ర పథకంలో వచ్చే సొమ్ముతో ఏటా ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 26వ తేదీతో ఇన్సూరెన్స్ గడువు ముగిసింది. ఇన్సూరెన్స్‌ను రెన్యూవల్ చేసేందుకు రూ.11,500 చెల్లించాల్సి రావడం ఆపరేటర్లకు భారంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఆరు నెలలకు చెల్లించాల్సిన ఐసీడీఎస్, ఏఎండీలకు రేషన్ సరఫరా చేసిన కమీషన్ రెండు విడతలుగా చెల్లించలేదు. ఈ రెండు విడ తలు కమీషన్ కలిపి ఉమ్మడి కృష్ణాజిల్లాలో రూ.14 లక్షల వరకు ఆపరేటర్లకు రావాల్సి ఉంది.
దసరా ఉత్సవాల తరహాలో కుంభాభిషేకం
రేషన్ మాఫియా గుట్టు రట్టు
మచిలీపట్నంఅర్బన్: స్థానిక ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ టి.లీలాప్రసాద్ నియమితులయ్యారు. ఆయన ఇప్పటి వరకు ఎస్పీవీ మెడికల్ కాలేజీలో ఈఎన్ టీఈ విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఐఏఎస్ అధికారి ప్రద్యుమ్న బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.


