తిరుపతమ్మ చిన్న తిరునాళ్ల ప్రారంభం పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ల ఉత్సవాలు బుధవారం ఉదయం 6.19 గంటలకు అఖండజ్యోతి స్థాపనతో వైభ వంగా ప్రారంభమయ్యాయి. మహాసంప్రోక్షణ అనంతరం ఆలయ ఈఓ బి.మహేశ్వరరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యుడు చుంచు రమేష్ ఆధ్వర్యంలో వేద పండితులు, పురోహితులు, అమ్మ వారి ఆలయ ఆలయ ప్రధానార్చకుడు మర్రెబోయిన గోపిబాబు, అర్చకులు, పాపమాంబ వంశీ కులు ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం జ్యోతి వెలిగించి ఉత్సవాలను ప్రారంభించారు. తెల్లవారు జాము నుంచి భక్తులు మునేరులో స్నానాలు చేసి పాలపొంగళ్లతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ జంగం శ్రీనివాసరావు, ఏఈ రాజు, ఉత్సవ కమిటీ సభ్యులు కల్లూరి శ్రీవాణి, శనగవరపు వెంకటేశ్వరరావు, పాకాలపాటి అనసూయ, పి.జ్యోత్స్న ప్రియాంక, గుగులోతు రమేష్, గజ్జి పెద్దఆంజనేయులు, కర్నాటి కవిత, ఓర్సు సూరమ్మ, తన్నీరు గోపీనాథ్, సరిపినేని అప్పారావు, కాకులపాటి విజయలక్ష్మి, కొలిపాక హైమావతి తదితరులు పాల్గొన్నారు.
రామలింగేశ్వర
ఆలయంలో సంప్రోక్షణ పెనమలూరు: మండలంలోని యనమలకుదురులో వేంచే సిన శ్రీపార్వతి సమేత శ్రీ రామ లింగేశ్వరస్వామి వారి దేవస్థా నంలో బుధవారం సంప్రోక్షణ చేశారు. చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ఆలయ ద్వారాలను మూసివేశారు. చంద్ర గ్రహణం ముగియడంతో బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ఆలయ ద్వారాలను పూజారులు తెరిచారు. ఆలయాన్ని సంప్రోక్షణ చేశారు. అనంతరం శ్రీపార్వతి సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి, ఇతర దేవతా మూర్తులకు విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించు కుని ప్రత్యేక పూజలు జరిపించారు.
ఎన్టీటీపీఎస్‌లో జాతీయ భద్రత వారోత్సవాలు గోసంరక్షణకు
రూ.లక్ష విరాళం
ఇబ్రహీంపట్నం: స్థానిక ఎన్టీటీపీఎస్‌లో బుధవారం జాతీయ భద్రత వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఇన్‌చార్జిచీఫ్ ఇంజినీర్ పి.అనురాధ ఈ కార్యక్ర మాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. భద్రతంటే ఒక రోజు పాటించే నియమం కాదన్నారు. దైనందిన జీవితంలో భద్రత ఒక భాగం కావాలని సూచించారు. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ వంటి కీలక విభాగాల్లో పనిచేసేటప్పుడు అప్రమత్తత కీలకమన్నారు. ప్రతి ఉద్యోగీ తనతో పాటు తోటి ఉద్యోగుల రక్షణను బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. రక్షణ పరికరాలు ధరించడంలో నిర్లక్ష్యం తగదని హితవుపలికారు. భద్రతా కమిటీ సభ్యులు, సిబ్బంది కలిసి భద్రతా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పలువురు సీనియర్, జూనియర్ ఇంజినీర్లు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో పోరంకిలో నిర్వహిస్తున్న గోసంరక్షణ కేంద్రానికి విజయవాడకు చెందిన భక్తులు బుధవారం రూ.లక్ష విరాళం సమర్పించారు. మొగల్రాజపురం శాంతినగర్‌కు చెందిన కె.లీలాకుమారి కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యుడు రామబ్రహ్మంనకు దాతలు ఈ విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండి తుల ఆశీర్వచనం అనంతరం దాతలకు చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.