ఫిట్‌గా ఉంటేనే అన్నింటా ఫస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఫిట్‌గా ఉంటేనే అన్నింటా ఫస్ట్‌

Mar 5 2026 7:45 AM | Updated on Mar 5 2026 7:45 AM

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): శారీరక, మానసికంగా ఫిట్‌గా ఉంటేనే అన్నింటా ఉత్తమ ఫలి తాలు సాధించగలమని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి. లక్ష్మీశ అన్నారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్‌ మహిళా ఉద్యోగుల విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం ఇందిరాగాంధీ మునిసిపల్‌ మైదానంలో క్రీడా పోటీలను శాప్‌ చైర్మన్‌ అనిమిని రవినాయుడు, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌, ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ, మహిళా విభాగం రాష్ట్ర చైర్‌పర్సన్‌ నిర్మలకుమారి, కన్వీనర్‌ పి.మాధవి తదితరులతో కలిసి కలెక్టర్‌ ప్రారంభించారు. కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం సమర్థవంతమైన పాలనకు కీలకమన్నారు. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్‌ మాట్లాడుతూ... క్రీడలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా నాయకత్వ లక్షణాలు, సమయపాలన, ఆత్మవిశ్వాసం వంటి గుణాలను పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎజ్జీఓ మహిళా విభాగం ప్రతినిధులు కె.శివలీల, వి.శాంతిశ్రీ, బి.జానకి, ఎం.సరస్వతి, బి.విజయశ్రీ, సీహెచ్‌.నాగమల్లేశ్వరి, ఎస్‌.దివ్య, వి.సురేఖ, పి.తులసీరత్నం తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement