పన్నులు సజావుగా వసూలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పన్నులు సజావుగా వసూలు చేయాలి

Feb 25 2026 10:41 AM | Updated on Feb 25 2026 10:41 AM

పన్నులు సజావుగా వసూలు చేయాలి

పన్నులు సజావుగా వసూలు చేయాలి

చిలకలపూడి(మచిలీపట్భం): జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వస్తు సేవల పన్నులు సజావుగా వసూలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ ఆయన చాంబర్‌లో వాణిజ్య పన్నుల వసూళ్లపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్‌ శాఖ పరిధిలో ఆస్తులు, భూముల క్రయవిక్రయాలు జరిగినప్పుడు అందుకు సంబంధించిన వివరాలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అందజేయాలన్నారు. తప్పనిసరిగా వస్తు సేవల పన్నులు వసూలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పౌర సరఫరాలు, తూనికలు కొలతలు, గనులు భూగర్భ శాఖల అధికారులు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటై ఉమ్మడిగా వాహనాలను తనిఖీ చేసి వస్తుసేవల పన్ను వసూలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్‌ జి. కల్పన, అదనపు ఎస్పీ వి. నాయుడు, వాణిజ్య పన్నుల శాఖ సహాయ కమిషనర్లు సౌమ్య, జగదీష్‌, రాజకుమార్‌, డీపీఓ డాక్టర్‌ జె. అరుణ, డీఎస్‌ఓ మోహన్‌ బాబు జెడ్పీ డెప్యూటీ సీఎం సీఈఓ ఆనంద్‌ కుమార్‌. జిల్లా ఆడిట్‌ అధికారి సూర్య ప్రకాష్‌ రావు జిల్లా రిజిస్ట్రార్‌ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement