పాలిసెట్‌ పోస్టర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

Feb 25 2026 10:41 AM | Updated on Feb 25 2026 10:41 AM

పాలిస

పాలిసెట్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

పాలిసెట్‌ పోస్టర్‌ ఆవిష్కరణ మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పాలిటెక్నిక్‌ కోర్సు పూర్తి చేసిన వారికి అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని పాలిసెట్‌– 2026 ఎన్టీఆర్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌, విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల కో–ఆర్డినేటర్‌ ఎం.విజయసారథి పేర్కొన్నారు. నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో పాలిటెక్నిక్‌ కోర్సు పూర్తి చేసిన వారికి ఉన్న ఉపాధి అవకాశాలు, పరీక్ష విధానం, పరీక్ష తేదీ వివరాలతో కూడిన పోస్టర్‌ను విజయసారథి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలిసెట్‌ ఏప్రిల్‌ 25వ తేదీన జరుగుతుందని తెలిపారు. పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలపై విద్యా ర్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, ఎక్కువ మంది కోర్సు వైపు ఆకర్షితులయ్యేందుకు పోస్టర్‌ను రూపొందించామన్నారు. పాలిసెట్‌ జిల్లా అసిస్టెంట్‌ కోఆర్డినేటర్‌ జి.వి.ఈశ్వర్‌రెడ్డి, అధ్యాపకులు బాబురావు, శోభన్‌ బాబు, మధుసూదనరావు, మూర్తి, నాగరాజు, రవి కిరణ్‌, హమీద్‌ పాల్గొన్నారు. కార్తికేయుని ఆలయానికి రూ.3 లక్షల విరాళం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం ఉత్సాహంగా సైక్లింగ్‌ పోటీలు

మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి హైదరాబాద్‌కు చెందిన కల్పటపు శేషశాయి, అడవి రాధాకృష్ణమూర్తి, రమాదేవి, ప్రసాద్‌ రూ.లక్ష విరాళంగా సమర్పించారు. మంగళవారం ఉదయం ఆలయానికి విచ్చేసిన వారు తొలుత స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్‌ అచ్యుత మదుసూధనరావును కలిసి విరాళం అందజేశారు. వారి కుటుంబీకులు కల్పటపు కామేశ్వరరావు, అన్నపూర్ణమ్మ, బాల సూర్యనారాయణమూర్తి పేరిట రూ.లక్ష, కల్పటపు వీరభద్రయ్య, శేషమ్మ పేరిట రూ.లక్ష చొప్పున విరాళాలను అందజేశారు. దాతలను ఆలయ అధికారులు సత్కరించారు.

మచిలీపట్నంఅర్బన్‌: కృష్ణా జిల్లాలో ఇంటర్మీ డియెట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మంగళవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయని డీఐఈఓ ఎస్‌.సరళ కుమారి తెలిపారు. మొత్తం 63 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరు గుతున్నాయని పేర్కొన్నారు. 21,763 మంది విద్యార్థులకు 21,584 మంది పరీక్షలకు హాజరయ్యారయ్యారని వివరించారు. మరో 179 మంది గైర్హాజరయ్యారని, 98 శాతం హాజరు నమోదైందని పేర్కొన్నారు. ఈ పరీక్షల కోసం సెట్‌–2 ప్రశ్న పత్రాన్ని వినియోగించామని తెలిపారు.

మచిలీపట్నంఅర్బన్‌: క్రీడలు శారీరక దారుఢ్యానికే కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా దోహదపడతాయని కృష్ణా జిల్లా క్రీడా ప్రాధి కార అధికారి కె.ఝాన్సీలక్ష్మి పేర్కొన్నారు. జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి సైక్లింగ్‌ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ.. బాలురకు పది, బాలికలకు ఆరు కిలోమీటర్ల దూరంలో మాస్‌ పార్టిసిపేషన్‌, టైమింగ్‌ విభాగాల్లో పోటీలు నిర్వహించామన్నారు. గన్నవరం, కంకి పాడు, గుడివాడ, గూడూరు, మచిలీపట్నం తదితర ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. అండర్‌–18 విభాగంలో విజేతలుగా నిలిచిన బాలురు, బాలికలు 28 మంది ఆదివారం విజయవాడ రూరల్‌ మండ లంలోని నున్న వద్ద జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని తెలి పారు. జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి ఎం.అరుణ, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పాలిసెట్‌ పోస్టర్‌ ఆవిష్కరణ1
1/1

పాలిసెట్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement