కృష్ణాజిల్లా
న్యూస్‌రీల్
తినలేని విధంగా భోజనం
300 మంది విద్యార్థులకు ఇబ్బందులు
కృష్ణా జేసీ తనిఖీలు
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
బుధవారం శ్రీ 25 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
జల్ జీవన్ మిషన్ పనులను పూర్తి చేయాలి
● సమస్యల సుడిలో జనరల్ నర్సింగ్ విద్యార్థులు
● భోజనంలో సుద్ద అన్నం, నీళ్ల చారు
● థియరీ బోధనకు తరగతి గదులు కరువు
● వైద్య మంత్రికి సమస్యలను
వివరించిన విద్యార్థులు
● రెండు నెలలు అవుతున్నా
మంత్రి తీసుకున్న చర్యలు శూన్యం
లబ్బీపేట(విజయవాడతూర్పు): జీఎన్‌ఎం నర్సింగ్ విద్యార్థులు అరకొర సౌకర్యాలతో సతమతవుతున్నారు. థియరీ పాఠాలు బోధించేందుకు తరగతి గదులు సరిపడా లేవు. నివసించేందుకు సైతం అవసరమైనన్ని గదులు కరువయ్యాయి. సుద్ద అన్నం, నీళ్ల చారుతో కూడిన భోజనం మింగుడు పడక ఇబ్బందిపడుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించండి సారూ అంటూ వైద్య శాఖ మంత్రికి విన్నవించారు. సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి రెండు నెలలు గడిచినా ఏ ఒక్క సమస్యా ఇప్పటి వరకు పరిష్కారానికి నోచుకోలేదు. తమ పరిస్థితి ఇంతేనా, సమస్యలతో సహవాసం చేయాల్సిందేనా అని జీఎన్‌ఎం నర్సింగ్ విద్యార్థులు తీవ్ర స్థాయిలో మదనపడుతున్నారు.
ప్రభుత్వాస్పత్రికి అనుబంధంగా నర్సింగ్ స్కూల్ ఉంది. ఆ స్కూల్‌లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జీఎన్‌ఎం నర్సింగ్ విద్యార్థులు 300 మంది వరకూ ఉన్నారు. వారికి అక్కడే వసతి సౌకర్యంతో పాటు, తరగతులు నిర్వహిస్తుంటారు. ప్రభుత్వాస్పత్రిలో క్లినికల్ శిక్షణ పొందుతుంటారు. గతంలో నర్సింగ్ స్కూల్ నిర్వహించిన భవనంలో సగ భాగాన్ని బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు కేటాయించారు. దీంతో జీఎన్‌ఎం విద్యార్థులకు తరగతి గదులు, వసతి గదులు చాలడం లేదు. థియరీ పాఠాలు వినేందుకు తరగతి గదులు, వసతి పొందేందుకు గదులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గదుల కొరతతో ఒక్కోసారి ఆరుబయట నిర్వహిస్తున్న తరగతులకు హాజరై పాఠాలు వినాల్సిన దయనీయ స్థితి నెలకొందని విద్యార్థులు వాపోతున్నారు.
తమకు అందిస్తున్న భోజనం తిన లేని విధంగా ఉంటోందని జీఎన్‌ఎం నర్సింగ్ విద్యార్థులు వాపోతున్నారు. సుద్ద అన్నం, నీళ్ల చారుతో ముద్ద మింగుడు పడటం లేదని, ఒక్కొక్క సారి ఉడికీ ఉడని అన్నం పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ భోజనం అరగక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వివరిస్తున్నారు. రేషన్ దుకాణాల్లో ఇచ్చే బియ్యంతో అన్నం వండుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం ఉండటం లేదని వాపోతున్నారు.
ఆర్టీసీ మహిళా ఉద్యోగుల ధర్నా
కృష్ణా జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన
తెలుపుతున్న సహకార సంఘాల ఉద్యోగులు
7
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పనులపై ప్రత్యేక దృష్టిపెట్టి త్వరితగతిన పూర్తి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన డీడబ్ల్యూఎస్‌ఎం సమావేశం మంగ ళవారం జరిగింది. జేజేఎం–కుళాయి కనెక్షన్లలో పురోగతి, పథకం పనితీరుపై సమీక్షించారు. స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ్)– ఓడీఎఫ్ ప్లస్, ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ, నీటి నాణ్యత పర్యవేక్షణ, నిఘా తదితరాలపై చర్చించారు. ఎ.కొండూరు మండలంలోని సీకేడీ ప్రభావిత ప్రాంతాల్లో ఇంటి కుళాయి కనెక్షన్ల భౌతిక స్థితిని పరిశీలించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. 100 శాతం కనెక్షన్లు కల్పించేందుకు డీపీఓకు ఆదేశాలిచ్చారు. గొల్లమండల తండా, జమలగడ్డ, దీప్లానగర్‌కు మార్చి నాటికి తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. వేసవిలో ఎక్కడా తాగునీటికి కొరత లేకుండా పకడ్బందీ ప్రణాళికలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, గ్రామీణ నీటి సరఫరా ఎస్‌ఈ ఎ. రామకృష్ణారావు, డీపీఓ పి.లావణ్యకుమారి, డ్వామా పీడీ ఎ.రాము, వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి పాల్గొన్నారు.
నందివాడ: కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్‌కుమార్ మంగళవారం నందివాడ గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. రికార్డులను, ఉద్యోగుల పనితీరును పరిశీలించారు.
ఇంద్రకీలాద్రి: బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి నగరంలోని కొత్తపేటకు చెందిన భక్తుడు సుంకర వెంకటేశ్వరరావు మంగళవారం రూ.1,00,116 విరాళం సమర్పించారు.
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా


