తలశిల చంద్రశేఖరరావుకు ఘన నివాళులు
భవానీపురం(విజయవాడపశ్చిమ): శాసనమండలి సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తండ్రి చంద్రశేఖరరావు దశదిన కర్మ కార్యక్రమం గొల్లపూడిలోని రఘురాం నివాసం వద్ద ఆదివారం జరిగింది.
ఎంపీ మిథున్‌రెడ్డి, సాక్షి దినపత్రిక సంపాదకులు ఆర్.ధనంజయరెడ్డి, మాజీ మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), వెలంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, విడదల రజని, మేరుగ నాగార్జున, కొడాలి నాని, కురసాల కన్నబాబు. ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, కల్పలతారెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, దువ్వాడ శ్రీనివాస్, ఎండీ రుహుల్లా, మొండితోక అరుణకుమార్, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొని తలశిల చంద్రశేఖరరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జక్కంపూడి రాజా, మేకా ప్రతాప్ అప్పారావు, వల్లభనేని వంశీమోహన్, ముదునూరి ప్రసాదరాజు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మొండితోక జగన్‌మోహనరావు, దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్సీ తలారి వెంకట్రావు, దేవభక్తుని చక్రవర్తి, కార్పొరేటర్లు, నగర నాయకులు పాల్గొని నివాళులర్పించారు.
తలశిల చంద్రశేఖరరావుకు ఘన నివాళులు


