ఎలక్ట్రికల్ ఎస్‌ఈగా రవీంద్రబాబు
మచిలీపట్నంటౌన్: విద్యుత్ శాఖ కృష్ణాజిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్‌ఈ)గా పి.రవీంద్రబాబు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఎస్‌ఈగా పనిచేసిన వీవీ చిరంజీవి ఫిబ్రవరి 28వ తేదీ శనివారం ఉద్యోగ విరమణ చేయడంతో రవీంద్రబాబు ఉద్యోగోన్నతిపై బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ఎస్‌ఈ కార్యాలయంలోని ఆయన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. రవీంద్రబాబు ప్రస్తుతం విజయవాడ నగర విద్యుత్ శాఖ డీఈగా పనిచేస్తూ ఉద్యోగోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వేసవిలో కృష్ణా జిల్లాలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అంతరాయం లేకుండా అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వినియోగదారులు సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్‌ఈ రవీంద్రబాబుకు విద్యుత్ శాఖ మచిలీపట్నం ఈఈ జి.గోవిందరావు, అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.


