టీటీడీ చైర్మన్‌ వెంటనే రాజీనామా చేయాలి | - | Sakshi
Sakshi News home page

టీటీడీ చైర్మన్‌ వెంటనే రాజీనామా చేయాలి

Mar 2 2026 8:49 AM | Updated on Mar 2 2026 8:49 AM

టీటీడ

టీటీడీ చైర్మన్‌ వెంటనే రాజీనామా చేయాలి

టీటీడీ చైర్మన్‌ వెంటనే రాజీనామా చేయాలి గుడ్లవల్లేరు పాలిటెక్నిక్‌ విద్యార్థుల సత్తా సౌత్‌జోన్‌ ఓపెన్‌ ఆర్చరీ టోర్నమెంట్‌లో పతకాలు

మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యుడు, దేవదాయ ధర్మదాయ శాఖ మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. సోషల్‌ మీడియాలో బీఆర్‌ నాయుడుకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవ్వడంతో హిందూ సమాజం తీవ్ర ఆందోళనకు గురైందని పేర్కొన్నారు. ఇటువంటి వివాదాస్పద పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా కొనసాగించడం సరైంది కాదని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి ఆయనను పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. నిజంగా శ్రీవారిపై భక్తి భావం ఉంటే ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

స్వామీజీలు స్పందించాలి..

తమ ప్రభుత్వ హయాంలో ఎస్వీబీసీ భక్తి చానల్‌కు సంబంధించిన వివాదంలో వెంటనే చర్యలు తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఎలాంటి అపరాధ భావం లేకుండా వైఎస్సార్‌ సీపీపై నిందలు మోపడం అనైతికమన్నారు. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా సమావేశాలు నిర్వహించిన స్వామీజీలు ఈ అంశంపై స్పందించాలని కోరారు. బీఆర్‌ నాయుడు బాధ్యతలు చేపట్టిన తరువాత ఆలయ పవిత్రత దెబ్బతినేలా వ్యవహారాలు జరుగుతున్నాయని పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రస్తావించారు. 70 ఏళ్ల వయస్సులో ఉన్న చైర్మన్‌కు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

గుడ్లవల్లేరు: మయూంకా – బీవీసీఐటీఎస్‌ యూత్‌ ఫెస్ట్‌లో తమ విద్యార్థులు సత్తా చాటారని గుడ్లవల్లేరు పాలిటెక్నిక్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఎన్‌.రాజశేఖర్‌ ఆదివారం విలేకరులకు తెలిపారు. అమలాపురంలోని బోనం వెంకట చలమయ్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌(అటానమస్‌)లో ఫిబ్రవరి 27, 28 తేదీలలో నిర్వహించిన మయూంకా – బీవీసీఐటీఎస్‌ జాతీయ స్థాయి యూత్‌ ఫెస్ట్‌ – 2026 వేడుకలు ఉత్సాహభరితంగా జరిగాయన్నారు. ఈ వేడుకల్లో తమ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో విజేతలుగా నిలిచారు.

విజేతలకు అభినందన..

బాలుర విభాగం బాల్‌ బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ – విజేతలుగా, టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్‌ – విజేతగా, టేబుల్‌ టెన్నిస్‌ డబుల్స్‌ – రన్నర్స్‌గా, బాలికల విభాగంలో బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ – విజేతలుగా, బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ – విజేతగా, టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్‌ – రన్నర్స్‌గా తమ విద్యార్థులు బహుమతుల పొందారని చెప్పారు. బాలురు, బాలికల విభాగాల్లో విజేతలుగా నిలిచి నగదు బహుమతులు, షీల్డులు, మెమెంటోలు అందుకోవడం కళాశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. విజేతలను వారికి ప్రత్యేక శిక్షణను అందించిన ఫిజికల్‌ డైరెక్టర్‌ వి.శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ పీడీ ఎమ్‌.భవదీప్‌ను చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరావు వల్లూరుపల్లి, యాజమాన్య సభ్యులు, వివిధ విభాగాధిపతులు, ప్రిన్సిపాల్‌ రాజశేఖర్‌ అభినందించారు.

మొగల్రాజపురం(విజయవాడతూర్పు): పాండిచ్చేరిలో జరుగుతున్న కేలో ఇండియా ఎన్‌టీపీసీ సౌత్‌జోన్‌ మెన్‌ అండ్‌ ఉమెన్‌ ఆర్చరీ టోర్నమెంట్‌–2026లో మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ప్రతిభ చూపి పతకాలు సాధించారని ఆంధ్రప్రదేశ్‌ ఆర్చరీ అసోసియేషన్‌ చైర్మన్‌ చెరుకూరి సత్యనారాయణ తెలిపారు. ఆర్చరీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, ది పాండిచ్చేరి ఆర్చరీ అసోసియేషన్‌, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, కేలో ఇండియా సంయుక్తంగా పాండిచ్చేరిలోని ది స్టడీ లోకల్‌ ఇంటర్నేషనల్‌ క్రీడా మైదానంలో టోర్నమెంట్‌ నిర్వహించారని తెలిపారు.

నగదు పురస్కారాలు..

టోర్నమెంట్‌ చివరి రోజైన ఆదివారం జరిగిన మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో కేఏఎస్‌.లేహ్యారెడ్డి, పురుషుల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో బి.రవితేజ వెండి పతకాలను చెరో రూ.15 వేల నగదు పురస్కారాన్ని, కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో కె.భరత్‌కుమార్‌ నాలుగో స్థానాన్ని సాధించి రూ.5 వేల నగదు పురస్కారాన్ని పొందారన్నారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను ఆంధ్రప్రదేశ్‌ ఆర్చరీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి బీవీ.రమణ, కోశాధికారి కృష్ణకుమారి అభినందించారు.

టీటీడీ చైర్మన్‌ వెంటనే  రాజీనామా చేయాలి
1
1/2

టీటీడీ చైర్మన్‌ వెంటనే రాజీనామా చేయాలి

టీటీడీ చైర్మన్‌ వెంటనే  రాజీనామా చేయాలి
2
2/2

టీటీడీ చైర్మన్‌ వెంటనే రాజీనామా చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement