కొనసాగుతున్న ఇంటర్మీడియెట్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ఇంటర్మీడియెట్‌ పరీక్షలు

Feb 26 2026 9:27 AM | Updated on Feb 26 2026 9:27 AM

కొనసా

కొనసాగుతున్న ఇంటర్మీడియెట్‌ పరీక్షలు

కొనసాగుతున్న ఇంటర్మీడియెట్‌ పరీక్షలు మచిలీపట్నంఅర్బన్‌: జిల్లాలో ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని జిల్లా ఇంటర్మీడియెట్‌ పరీక్షల అధికారి ఎస్‌.సరళ కుమారి తెలిపారు. బుధవారం ఇంటర్‌ మొదటి ఏడాది ఇంగ్లిష్‌ పరీక్ష జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సెట్‌–2 ప్రశ్నపత్రాన్ని వినియోగించినట్లు తెలిపారు. జిల్లాలోని 63 కేంద్రాల్లో పరీక్షలు సజావుగా జరిగాయన్నారు. ఈ పరీక్షకు మొత్తం 23,626 మంది విద్యార్థులకు 23,144 మంది హాజరయ్యారని తెలిపారు. 482 మంది గైర్హాజరవగా 97 శాతం హాజరు నమోదైందని వివరించారు. నందిగామలో డ్రగ్స్‌పై దండయాత్ర ముదిరాజ్‌ కార్పొరేషన్‌ను వెంటనే ప్రకటించాలి

నందిగామ రూరల్‌: మాదక ద్రవ్యాల వినియోగం ప్రమాదకరమైన వ్యసనమని పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖర్‌బాబు పేర్కొన్నారు. డ్రగ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించి, వాటి వాడకాన్ని నియంత్రించేందుకు పోలీసు శాఖ చేపట్టిన డ్రగ్స్‌పై దండయాత్ర సైకిల్‌ ర్యాలీ బుధవారం నందిగామకు చేరింది. మండలంలోని మునగచర్ల వద్ద సైకిల్‌ ర్యాలీకి ఏసీపీ లతాకుమారి, సీఐ వై.వి.ఎల్‌.నాయుడు పాఠ శాల విద్యార్థులతో కలిసి స్వాగతం పలికారు. సీపీ రాజశేఖర్‌ బాబు, సినీ నటుడు సుమన్‌ మద్దతు తెలిపి ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలోని శ్రీకరం కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. డ్రగ్స్‌పై అవగాహన కలిగించేందుకు చేపట్టిన సైకిల్‌ ర్యాలీకి ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోందన్నారు. ఇప్పటి వరకు 470 కిలో మీటర్ల మేర ర్యాలీ జరిగిందని తెలిపారు.

బాధ్యతాయుతంగా నడుచుకోవాలి..

యువత డ్రగ్స్‌ వంటి చెడు వ్యసనాలకు బానిసవకుండా యువత బాధ్యతాయుతంగా నడుచు కోవాలని సినీ నటుడు సుమన్‌ సూచించారు. డ్రగ్స్‌ తీసుకోవటం వల్ల ఆరోగ్యం దెబ్బతినటంతో పాటు కుటుంబాలు రోడ్డున పడతాయని హెచ్చరించారు. అనంతరం సైకిల్‌ యాత్ర చేపట్టిన మహిళా పోలీసులను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ డీసీపీ అడ్మిన్‌ సరిత, ఏసీపీలు లతాకుమారి, తిలక్‌, ఎస్‌ఐలు సూర్య వంశీ, మోహనరావ తదితరులు పాల్గొన్నారు.

డే కేర్‌ సెంటర్‌లో అమానుషం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): భవానీపురం స్టేషన్‌ పరిధిలోని ఓ డే కేర్‌ సెంటర్‌లో అమానుష ఘటన వెలుగుచూసింది. డే కేర్‌ సెంటర్‌కు వెళ్లిన చిన్నారికి ఒంటిపై, ప్రైవేటు భాగాల్లో కాలిన గాయాలు అయ్యాయి. ఈ ఘటన పై భవానీపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. విద్యాధరపురానికి చెందిన ఓ చిన్నారి ఎనిమిది నెలలుగా డే కేర్‌ సెంటర్‌కు వెళ్తోంది. ఉదయం 9.30 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు డే కేర్‌ సెంటర్‌ నిర్వాహకుల సంరక్షణ లోనే ఉంటోంది. ఈ క్రమంలో ఈ నెల 23వ తేదీ 11.30 గంటల ప్రాంతంలో సెంటర్‌ నిర్వాహకులు బాలిక పిన్నికి ఫోన్‌ చేసి పాపకు డ్రెస్‌ తీసుకుని రావాలని సూచించారు. ఆమె వెంటనే సెంటర్‌కు వెళ్లింది. అప్పుడు బాలిక ఒంటిపై దుస్తులు లేవు. తనతో తీసుకెళ్లిన డ్రెస్‌ వేసి చిన్నారిని ఇంటికి తీసుకెళ్లింది. ఇంటికి వెళ్లిన తర్వాత బాలిక చెంపల కింద గాయం కనిపించింది. ప్రైవేటు భాగాల్లో ముందు, వెనుక కాలిన గాయాల తరహాలో గుర్తులు కని పించాయి. దీనిపై సెంటర్‌ సిబ్బందిని ఏం జరిగిందని బాలిక కుటుంబ సభ్యులు ప్రశ్నించగా.. బాలిక ఆడుకుంటూ సోప్‌ ఆయిల్‌, ఫెనాయిల్‌ పడిపోయిన చోట కూర్చుందని చెప్పారు. బాలిక మాత్రం తనను టీచర్‌ కొట్టిందని తల్లికి చెప్పింది. బాలికకు వైద్యం అందించేందుకు ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. బాలిక తల్లిదండ్రులు డే కేర్‌ సెంటర్‌లోని ఓ టీచర్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెకు ప్రైవేటు భాగాల్లో కాలిన గాయాలు కావడానికి టీచర్‌ కారణమని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

పటమట(విజయవాడతూర్పు): ముదిరాజ్‌ సోదరులు ఎంతగానో ఎదురు చూస్తున్న ముదిరాజ్‌ కార్పొరేషన్‌ను వెంటనే ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.మారేష్‌ పేర్కొన్నారు. పటమటలోని సంస్థ కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌ సీపీ ముదిరాజులను ఎమ్మెల్యేగా చేసిందని, మంత్రి పదవి కూడా ఇచ్చిందని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు ముదిరాజ్‌ కార్పొరేషన్‌ ప్రకటించకపోవడం వారిని నిరాశకు గురి చేయడమేనని పేర్కొన్నారు. తమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముదిరాజు సోదరులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వారి జీవన స్థితిగతులను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని పేర్కొన్నారు.

కొనసాగుతున్న ఇంటర్మీడియెట్‌ పరీక్షలు 1
1/1

కొనసాగుతున్న ఇంటర్మీడియెట్‌ పరీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement