న్యూస్‌రీల్
సువర్ణ శిఖరాన భక్తిశ్రద్ధలతో ముగిసిన క్రతువు
పెనమలూరు: మండలంలోని యనమలకుదురు కొండపై ఉన్న శ్రీపార్వతీ సమేత శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలోని హుండీల్లో సొమ్ము చోరీ అయ్యింది. దీనిపై దాత సంగా నరసింహారావు ఫిర్యాదు మేరకు ఆలయ ఈవో ఎన్.భవాని, ప్రధాన అర్చకుడు సాగర్, అర్చకుడు పూర్ణ, వర్కర్ రోశయ్యపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. ఈ ప్రాంగణంలో శివాలయం, అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, గణపతి, ఆంజనేయ, నాగేంద్రస్వామి ఆలయాల వద్ద హుండీలున్నాయి. భక్తులు ఈ హుండీల్లో సమర్పించిన కానుకలను ఏడాదికి మూడుసార్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్.భవాని, ప్రధాన అర్చకుడు జి.ఆర్.వి.సాగర్, అర్చకులు, అటెండర్లు, గ్రామస్తుల సమక్షంలో లెక్కిస్తారు. ఆలయ పూజారులు పూర్ణ, సాగర్ శుక్రవారం గ్రామంలో మద్యం తాగి గొడవపడ్డారు.
సొమ్ము విషయంలో తేడాలు..
హుండీల్లో కాజేసిన సొమ్ము విషయంలో వారి మధ్య గొడవ జరగడాన్ని ఆలయ దాత సంగా నరసింహారావు, డ్రైవర్ రాజులపాటి సాయిబాబు గమనించారు. ఈ విషయాన్ని నరసింహారావుకు చెప్పారు. దీంతో ఆయన ఆలయంలో రోజువారి పనిచేసే రోశయ్యను పిలిచి ప్రశ్నించారు. రెండేళ్లుగా హుండీలో సొమ్ము స్వాహా చేస్తున్నట్లు రోశయ్య ఆయనకు చెప్పారు. ఆలయ ప్రాంగణంలో పలు ప్రదేశాల్లో ఉన్న హుండీల్లోని సొమ్మును లెక్కింపునకు తీసుకొచ్చే సమయంలో మధ్యలోనే ఈవో భవాని సహకారంతో పూజారులు సాగర్, పూర్ణ, తాను స్వాహాచేసినట్లు రోశయ్య తెలిపారు. అంతరాలయంలో ఉన్న ప్రధాన హుండీకి నకిలీ తాళం చెవులు తయారు చేసి కూడా సొమ్ము కాజేశారని, రూ.10 లక్షల వరకు సొమ్ము స్వాహా చేశారని నరసింహారావు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సూత్రధారులు ఈవో ఎన్.భవాని, ఆలయ ప్రధాన అర్చకుడు సాగర్, అర్చకుడు పూర్ణ, వర్కర్ రోశయ్యపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీంతో పోలీసులు ఆ నలుగురిపై కేసు నమోదు చేశారు.
అభిషేకానికి పవిత్ర జలాలను బంగారు గోపురం వద్దకు తీసుకెళ్తున్న అర్చకులు
పెనమలూరు: ఉమ్మడి కృష్ణా జిల్లా బాడీబిల్డింగ్, ఫిజిక్ స్పోర్ట్స్ పోటీలు నిర్వహించనున్నామని ఉమ్మడి జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.మనోహర్, తాళ్లూరి అశోక్ తెలిపారు. ఈ మేరకు కానూరు అశోక్ జిమ్‌లో ఆదివారం సంఘం గౌరవాధ్యక్షుడు గొట్టిపాటి రామకృష్ణప్రసాద్ పోస్టర్ ఆవిష్కరించారు. మనోహర్, అశోక్ వివరాలు తెలుపుతూ ఈ పోటీలు విజయవాడలో మార్చి 29వ తేదీన జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో చాంపియన్ ఆఫ్ ది చాంపియన్ 2026 అవార్డుతో పాటు, వివిధ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. కె.ఈశ్వరరావు, సీహెచ్ రాజు, ఈదా రాజేష్, అల్లూరిరెడ్డి, ఎస్‌కే ఖాదర్ పలువురు పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు 8686771358, 9705663252లో సంప్రదించాలని సూచించారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): అధికారులను సైతం బెదిరింపులకు గురిచేస్తూ, రేషన్ మాఫియాకు డాన్‌లా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన కాజా సత్యనారాయణపై పీడీ యాక్ట్‌ను అమలు చేస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు ఒక ప్రకటన విడుదల చేశారు. కాజా సత్యనారాయణ(50) నందిగామ, మైలవరం సబ్ డివిజన్ పరిధిలోని లబ్ధిదారుల వద్ద నుంచి, కొంతమంది డీలర్స్ వద్ద నుంచి రేషన్ బియ్యాన్ని తీసుకుని వాటిని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంటాడని తెలిపారు. సత్యనారాయణ తొలిసారిగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ 2011లో పట్టుబడ్డాడని, అప్పటి నుంచి ఇప్పటి వరకు 41 కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 2న డెప్యూటీ తహసీల్దార్‌కు వచ్చిన పక్కా సమాచారం మేరకు వీరులపాడు మండలం జయంతి గ్రామంలోని ఒక షెడ్‌ను తనిఖీ చేసి 147.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, ఎనిమిది వాహనాలను స్వాధీనం చేసుకుని వీరులపాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీంతో అతనిపై పీడీ యాక్ట్ అమలు చేసి రాజమండ్రి జైలుకు తరలించినట్లు తెలిపారు.
కంకిపాడు: లక్ష్యానికి అనుగుణంగా పన్ను వసూళ్లు పూర్తి చేయాలని కృష్ణా జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ జె.అరుణ అన్నా రు. మండలంలోని ఉప్పలూరు, ఈడుపుగల్లు గ్రామాల్లో ఆదివారం ఆమె విస్తృతంగా పర్యటించారు. పలు కాలనీల్లో ఇంటి పన్నులకు సంబంధించిన డిమాండ్ నోటీసులను యజ మానులకు అందించారు. పన్ను వసూళ్లు, పెండింగ్ పన్నులపై సమీక్ష చేశారు. ఆమె మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాన్ని త్వరితగతిన అధిగమించాలన్నారు. బకాయిలపై దృష్టి సారించాలని ఆదేశించారు. పరిశీలనలో ఈఓ బి.వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం వైభవంగా సాగింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురువులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా క్రతువు జరిగింది. కుంభాభిషేకం వేళ తులసీవనం, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ ప్రాంగణం, ప్రసాదాల విక్రయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. మరో వైపున అమ్మవారి దర్శనానికి విచ్చేసే మార్గంలోని బంగారు గోపురం వీక్షించే ప్రాంతం, క్యూలైన్లలో భక్తులు వేచి ఉండి కుంభాభిషేకాన్ని వీక్షించారు. కుంభాభిషేకాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయాన్ని వివిధ వర్ణాల పుష్పాలతో, మామిడి తోరణాలతో, అరటి చెట్లతో అందంగా అలంకరించారు.
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మూడు రోజులుగా జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవం ఆదివారంతో ముగిసింది. ఉదయం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో మంటప పూజలు, మూలమంత్ర హవనం నిర్వహించారు. అనంతరం మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. ఉదయం 9గంట లకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్‌లాల్, కమిషనర్ రామచంద్రమోహన్, సీపీ రాజశేఖరబాబు, చైర్మన్ రాధాకృష్ణ, దుర్గగుడి ఆలయ ప్రధాన అర్చకులు ఎల్. దుర్గాప్రసాద్, అర్చకులు, వేద పండితులు అమ్మవారి బంగారు కలశం వద్దకు చేరుకున్నారు. బంగారు కలశానికి విజయేంద్ర సరస్వతి స్వామి పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం సుముహూర్తమైన 9.34 గంటలకు పవిత్ర నదీ జలాలు, సముద్ర జలాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు.
అమ్మవారికి మహా నివేదన సమర్పించిన అనంతరం ఆలయం వెలుపలకు విచ్చేసిన స్వామిజీ నేరుగా ఆలయ ప్రాంగణంలోని కళావేదిక వద్దకు చేరుకుని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఆలయాల్లో జరిగే విశేష పూజల వల్ల ఫలితాలు, భగవంతుడికి, భక్తుడికి మాధ్యమంగా ఉండేవి ఆలయాలేనని, యువ త ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం శుభపరిణామమన్నారు. వారంలో రెండు రోజుల పాటు యువతకు, కాలేజీ విద్యార్థులకు ప్రత్యేక దర్శన సమయం ఇవ్వాలని స్వామిజీ ఆకాంక్షించారు. అనంతరం ఈవో, చైర్మన్, ట్రస్ట్‌బోర్డు సభ్యులతో పాటు అధికారు లు, సిబ్బందికి స్వామిజీ ప్రసాదాలను అందించారు.
పూర్ణాహుతి
నిర్వహిస్తున్న అర్చకులు
విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల
మీదుగా అభిషేకం
దుర్గమ్మవారికి స్వామిజీ ప్రత్యేక పూజలు
ఆలయ ప్రాంగణంలో అనుగ్రహ భాషణం
భక్తజనంతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి


