పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాలి | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాలి

Feb 22 2026 8:42 AM | Updated on Feb 22 2026 8:42 AM

పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాలి

పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించాలి

మచిలీపట్నంటౌన్‌: స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పర్యావరణ పరిరక్షణకు, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని మంత్రి కొల్లు రవీంద్ర ప్రజలను కోరారు. కలెక్టరేట్‌ సమీపంలో ఉన్న బాల భవన్‌ బ్యాడ్మింటన్‌ కోర్టు ప్రాంగణం, ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంగణంలో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో మంత్రి, ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ బండి రామకృష్ణ, కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీ, పలువురు జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు. మంత్రి రవీంద్ర ప్రాంగణంలోని వ్యర్థాలను, పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రం చేశారు. పారిశుద్ధ కార్మికులతో కలిసి మంత్రి, జిల్లా కలెక్టర్‌, ఆర్టీసీ చైర్మన్‌ ఫొటో దిగారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కొల్లు మాట్లాడుతూ.. మచిలీపట్నం నగరం స్వచ్ఛత కార్యక్రమాల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినందుకు జిల్లా కలెక్టర్‌ను, మునిసిపల్‌ కమిషనర్‌ను అభినందించారు. చెత్త ప్రాసెసింగ్‌ ప్లాంటును ఏర్పాటుకు కోన మార్గంలో 13 ఎకరాల స్థలాన్ని కేటాయించామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కన్నమ నాయుడు, మునిసిపల్‌ కమిషనర్‌ బాపిరాజు, బీసీ సంక్షేమ అధికారి రమేష్‌, జిల్లా ఖజానా అధికారి రవికుమార్‌, డీఎస్డీఓ ఝాన్సీలక్ష్మి, మత్స్య శాఖ అధికారి అయ్యా నాగరాజ, ఆర్డీఓ పోతురాజు, డీటీడబ్ల్యూఓ ఫణి ధూర్జటి, పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, బీసీ కార్పొరేషన్‌ ఈడీ రాజేంద్రప్రసాద్‌, అర్బన్‌ బ్యాంకు చైర్మన్‌ దిలీప్‌ కుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ గొర్రెపాటి గోపీచంద్‌, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మోటమర్రి బాబా ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement