కోడెలతో రథోత్సవం
కోడెలతో రథోత్సవం పెనుగంచిప్రోలు: గ్రామంలో వేం చేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత లక్ష్మీతిరుతపతమ్మ అమ్మవారి ఆలయం చుట్టూ ఆదివారం కోడెలతో రథోత్సవం నిర్వహించారు. కొన్ని రోజులుగా గోశాలలోని కోడెదూడలకు రథాన్ని లాగడంలో తర్ఫీదునిచ్చారు. గతంలో గ్రామంలోని కోడెలు, ఎద్దులతో రథోత్సవం నిర్వహించారు. ఈ సారి అలాకాకుండా ఆలయానికి చెందిన గోశాలలోని కోడెల ద్వారా రఽథోత్సవాన్ని నిర్వహించాలని తలంచి సిబ్బంది వాటికి తర్ఫీదునిచ్చారు. భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
సుబ్బారాయుడి ఒక్క రోజు ఆదాయం రూ.11.16 లక్షలు తోలుబొమ్మలాట కులస్తులను బీసీ(ఏ) జాబితాలో చేర్చాలి దుర్గమ్మ సన్నిధికి
విద్యార్థుల తాకిడి ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దర్శనానికి ఆదివారం పెద్ద ఎత్తున విద్యార్థులు, నూతన వధూవరులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. దీంతో ఆదివారం తెల్లవారుజామున 6 గంటల నుంచి సాయంత్రం వరకు రద్దీ కొనసాగింది. రెండు రోజులుగా సుహుహుర్తాల వేళ ఒక్కటైన నూతన వధూవరులు పెళ్లి బట్టలపై అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా తరలివచ్చారు. మరో వైపున సోమవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానుండటంతో విద్యార్థులు హాల్‌టికెట్లు తీసుకుని అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. ఇంటర్ విద్యార్థులు తమ తల్లిదండ్రులతో అమ్మవారిని దర్శించుకుని హాల్ టికెట్‌ను అమ్మవారికి చూపి మంచి మార్కులతో ఉత్తీర్ణత అయ్యేలా దీవించమని వేడుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు కిటకిటలాడుతూ కనిపించాయి.
భక్తుల రద్దీ నేపథ్యంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. రూ.300 టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు బంగారు వాకిలి, రూ.300 ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శనానికి అనుమతించారు. సుమారు 30 వేల పైబడి విద్యార్థులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. మహా నివేదన అనంతరం రద్దీ మరింత అధికం కావడంతో ఆలయానికి చెందిన పలువురు అధికారులకు ప్రత్యేక విధులు కేటాయించారు. స్కానింగ్ పాయింట్, టికెట్ పంచింగ్ పాయింట్లతో పాటు లక్ష్మీగణపతి విగ్రహం వద్ద ఆలయ అధికారులు, సిబ్బంది రద్దీని నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవలో ఉభయ దాతలు విశేషంగా పాల్గొన్నారు.
మోపిదేవి: మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆదివారం ఒక్క రోజు వివిధ సేవా టికెట్ల ద్వారా రూ.11,16,611 ఆదాయం వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ స్వామివారికి సేవా టికెట్లు ద్వారా రూ.5,81,106, లడ్డూ ప్రసాదం ద్వారా రూ.1,78,055, నిత్యాన్నదాన కార్యక్రమానికి రూ.1,82,491, శాశ్వత అన్నదానానికి రూ.25,245, స్వామివారి కల్యాణ కట్ట టికెట్ల ద్వారా రూ.32,600, స్వామివారి దర్శనం ద్వారా రూ.71,450, మొత్తం రూ.11,16,611 ఆదాయం వచ్చిందన్నారు.
కృష్ణలంక(విజయవాడతూర్పు): తోలుబొమ్మలాట కులస్తులను బీసీ(ఏ) జాబితాలో చేర్చాలని, దేవదాయ ధర్మాదాయ శాఖలో, వైద్య ఆరోగ్యశాఖలో అవకాశాలు కల్పించాలని ఏపీ తోలుబొమ్మలాట వృత్తి కళాకారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అనపర్తి ఏడుకొండలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఆదివారం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ తోలుబొమ్మలాట కళాకారులకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని, రూ.10 వేలు పెన్షన్ ఇవ్వాలని, కళాకారుల పిల్లలకు వృత్తిపరమైన శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి వాద్య పరికరాల కొనుగోలుకు సబ్సిడీపై లోన్స్ ఇవ్వాలని, కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి డిజిటలైజ్ చేయాలని కోరారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్‌కుమార్, జానపద కళాకారుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వీర్నాల కృష్ణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అంతరాలయ దర్శనం రద్దు..
1/2
కోడెలతో రథోత్సవం
2/2
కోడెలతో రథోత్సవం