క్షేత్రస్థాయిలో ఉద్యోగుల పరిస్థితి దయనీయం
యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే(కుటుంబ వివరాలు), అక్షరాంధ్ర, మన మిత్ర, ఈ–గవర్నర్స్, పురమిత్ర యాప్, పీ–4, వాట్సప్ గవర్నర్స్, ఈ–కేవైసీ అప్డేట్, మొబైల్ అప్డేట్ సర్వేలతో పాటు ఎవరైనా ఇంటి వద్ద వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాలు ఎంతమంది చేస్తున్నారనే సర్వేలు కూడా చేయిస్తూ సచివాలయ ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటం అడుతున్నారు. ప్రభుత్వ లక్ష్యాలను సాధించే క్రమంలో ఉన్నతాధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరిస్తూ మెమోలు జారీ చేయడానికి సైతం వెనుకాడటం లేదు. క్షేత్రస్థాయిలో ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది.


