నాన్‌వెజ్ ఎక్కువగా తినకూడదు..
మనం తీసుకునే ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలి. బిర్యానీలు, నాన్‌వెజ్ వంటకాలు ఎక్కువగా తినడం మంచిది కాదు. వాటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వలన ఫ్యాటీ లివర్, జీర్ణకోశ వ్యాధులు వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో చెడు కొలస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎక్కువ మంది చిరుధాన్యాలపై ఆసక్తి చూపుతున్నారు. వాటిలో కూడా పిండి పదార్ధాలు అధికంగా ఉంటాయి. కాబట్టి పరిమితంగానే వాటిని తీసుకోవాలి. తాజా పళ్లు, కూరగాయలు, సీజనల్ ఫ్రూట్స్, పాలు, కోడిగుడ్డు వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఇంట్లో తయారు చేసిన ఆహారం తీసుకుంటే మంచిది. మధుమేహం ఉన్న వారు. ప్రీ డయాబెటీస్ స్టేజ్‌లో ఉన్న వారు. ఆహార నియమాల విషయంలో మరింత జాగ్రత్త వహించాలి.
– డాక్టర్ కె.వేణుగోపాలరెడ్డి,
మధుమేహ నిపుణుడు


