ఎన్టీఆర్ జిల్లా జేఏసీ ఏకగ్రీవ ఎన్నిక
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఏకగీవ్రంగా ఎన్నికై ంది. ఏపీ ఎన్జీఓ హోంలో ఆదివారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జేఏసీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జేఏసీ ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ డీఎస్‌ఎన్ రెడ్డి, కో–చైర్మన్లుగా పి.రమేష్ (జిల్లా కార్యదర్శి, ఏపీఎన్జీఓ సంఘం), జి. అనుగ్రహ ప్రసాద్(రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం), రామకృష్ణ (రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ), ఉపాధ్యక్షులుగా జి. నారాయణరావు(పెన్షనర్ల సంఘం), ఎస్.కె. నవాబ్ జానీ(పీఆర్టీయూ), కె.ప్రభాకర్ (సివిల్ పెన్షనర్స్ సంఘం), జి.అజయ్ కుమార్ (మున్సిపల్ కార్పొరేషన్), ప్రధాన కార్యదర్శిగా ఎస్.డి.ఖాసిం (ఏపీటీ ఎఫ్–257), కార్యనిర్వహణ కార్యదర్శిగా జి.రామకృష్ణ (ఏపీఎన్జీఓల సంఘం) ఎన్నికయ్యారు. వీరితో పాటు సంయుక్త కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.


