రాజాధిరాజ వాహనంపై నృసింహుడు
మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజైన బుధవారం స్వామి వారు రాజాధిరాజ వాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాన్ని తిలకించిన వారు సుఖ సంతోషాలతో వెలుగొందుతారని నమ్మకం. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించు కుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్‌కుమార్ పర్యవేక్షించారు. ఉత్సవ కైంకర్యపరులుగా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన పెమ్మసాని శైలేంద్ర వ్యవహరించారు.
నేడు యాలి వాహనంపై..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు గురువారం రాత్రి యాలివాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాలను భక్తులు తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ అధికారులు కోరారు.


