10న కయ, విక్రయదారుల సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

10న కయ, విక్రయదారుల సమ్మేళనం

Feb 26 2026 9:27 AM | Updated on Feb 26 2026 9:27 AM

10న కయ, విక్రయదారుల సమ్మేళనం

10న కయ, విక్రయదారుల సమ్మేళనం

10న కయ, విక్రయదారుల సమ్మేళనం పెనమలూరు: మండలంలోని కానూరులో మార్చి పదో తేదీన క్రయ, విక్రయదారుల సమ్మేళనం జరుగుతుందని కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీ తెలి పారు. కానూరులోని వీఆర్‌ సిద్ధార్థ డీమ్డ్‌ టూ బీ యూనివర్సీటీని కలెక్టర్‌ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలుదారులు, అమ్మకందారుల సమ్మేళనంలో జిల్లాకు చెందిన 200 మంది వ్యాపారులు వివిధ రకాల ఆహార ఉత్పత్తులు, వస్త్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలుదారులు వస్తారని తెలిపారు. దీని వల్ల జిల్లాలో వివిధ రకాల ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగి వ్యాపారవేత్తకు ఆదాయం సమకూరుతుందని వివరించారు. సమ్మేళనంలో పాల్గొనే వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్‌ జి.కల్పన, డీఆర్డీఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ హరిహరనాథ్‌, ఆర్డీఓ బి.ఎస్‌.హేలాషారోన్‌, డీఐసీ జీఎం వెంకట్రావు, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ బాబ్జి, జిల్లా ఉద్యాన అధికారి జె.జ్యోతి తదితరులు పాల్గొన్నారు. కానూరు సంతోష్‌ నెక్సా షోరూమ్‌లో వాహనాల రిజిస్ట్రేషన్‌ను కలెక్టర్‌ బాలాజీ పరిశీలించారు. గతంలో రవాణా శాఖ కార్యాలయంలో వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగేవని, ఇప్పుడు నేరుగా షోరూమ్‌లలోనే నిర్వహించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. క్షేత్రస్థాయిలో రిజిస్ట్రేషన్ల తీరును కలెక్టర్‌ బాలాజీ పరిశీలించారు. ప్రతి షోరూమ్‌లో వాహనాల పన్నులు, బీమా, ఇతర చార్జీల వివరాలు తెలుపుతూ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ అధికారులు పాల్గొన్నారు. జోగి సోదరుల బెయిల్‌ రద్దుపై విచారణ వాయిదా

వాహనాల రిజిస్ట్రేషన్లను పరిశీలించిన కలెక్టర్‌

విజయవాడలీగల్‌: నకిలీ మద్యం కేసులో బెయిల్‌ పొందిన జోగి రమేష్‌, జోగి రాము బెయిల్‌ షరతులకు విరుద్ధంగా మీడియాతో మాటాడారని, ర్యాలీ నిర్వహించారనే అభియోగంపై పోలీసులు వారిరువురి బెయిల్‌ను రద్దుచేయాలని కోరుతూ 8వ అదనపు జిల్లా జ్యుడీషియల్‌ న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణను న్యాయమూర్తి గురువారానికి వాయిదా వేశారు. ఇదే కేసులో రిమాండ్‌లో ఉన్న తాండ్ర రమేష్‌బాబు బెయిల్‌ పిటీషన్‌పై వాదనల నిమిత్తం ఎకై ్సజ్‌ కోర్టు న్యాయమూర్తి తీర్పును వచ్చే నెల రెండో తేదీకి వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement