తిరుపతమ్మ చిన్న తిరునాళ్లను జయప్రదం చేయాలి | - | Sakshi
Sakshi News home page

తిరుపతమ్మ చిన్న తిరునాళ్లను జయప్రదం చేయాలి

Feb 27 2026 7:48 AM | Updated on Feb 27 2026 7:48 AM

తిరుపతమ్మ చిన్న తిరునాళ్లను జయప్రదం చేయాలి

తిరుపతమ్మ చిన్న తిరునాళ్లను జయప్రదం చేయాలి

పెనుగంచిప్రోలు: గ్రామంలో వేంచేసిన శ్రీతిరుపతమ్మ వారి చిన్న తిరునాళ్ల ఉత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని నందిగామ ఆర్డీఓ కె.బాలకృష్ణ సూచించారు. మార్చి నాలుగు నుంచి ఐదు రోజుల పాటు జరిగే తిరునాళ్లకు సంబంధించి గురువారం ఆలయ సత్రాల్లో అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సంద ర్భంగా ఆర్డీఓ బాలకృష్ణ మాట్లాడుతూ.. తిరునాళ్లు జరిగే ఐదు రోజులు పారిశుద్ధ్యం, తాగునీటి సరఫ రాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మార్చి ఏడో తేదీన పుట్టింటి పసుపు–కుంకుమ బండ్లకు విద్యుత్‌ దీప కాంతులు ఏర్పాటు చేసే సందర్భంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. భక్తులకు అసౌకర్యం లేకుండా ఆలయం వద్ద పలు శాఖల సమాచార కేంద్రాలతో పాటు, తాగునీటి సౌకర్యం, తాత్కాలి కంగా బస్టాండ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కంట్రోల్‌ రూం ఏర్పాటుతో పాటు అందులో అన్నిశాఖల అధికారులు ఉండాలన్నారు. తిరునాళ్లకు ముందు రోజు కల్లా అన్ని శాఖల అధికారులు తమ యాక్షన్‌ ప్లాన్‌తో పాటు, ఫోన్‌ నంబర్లను ఆలయ అధికారులకు, రెవెన్యూ కార్యాలయంలో అందజేయాలన్నారు. బెల్ట్‌ షాపులు లేకుండా చేయాలని ఎకై ్సజ్‌ సీఐ రమా దేవికి సూచించారు. ఆలయం వద్ద దుకాణాలను నిర్ణయించిన చోట మాత్రమే ఏర్పాటు చేయాలన్నారు. పసుపు–కుంకుమల బండ్లు ఎన్ని వచ్చేది ముందుగా రెవెన్యూ కార్యాలయంలో తెలపాలని కోరారు. ఆలయ ఈఓ బి.మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ఉత్సవాల సందర్భంగా ఐదు రోజుల పాటు ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామ న్నారు. మునేటిలో భక్తులకు జల్లు స్నానాలతో పాటు మునేరులో తాత్కాలిక కేశఖండనశాల ఏర్పాటు చేస్తామన్నారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని ఆ శాఖ అధికారులను ఈఓ కోరారు. డీసీపీ బి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు ఎటువంటి అవరోధం లేకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎ.శాంతిలక్ష్మి, ఎంపీడీఓ జి.శ్రీను, ఆలయ ఈఈ రమాదేవి, నందిగామ ఏసీపీ తిలక్‌, జగ్గయ్యపేట సీఐ పి.వెంకటేశ్వర్లు, వైద్యాధికారి నాగరాణి, విద్యుత్‌ ఏఈ వెంకటకృష్ణ, పీఆర్‌ ఏఈ సుందరరామయ్య, ఆర్‌అండ్‌బీ ఏఈ సురేష్‌, గ్రామ కార్యదర్శి శ్యామ్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

నందిగామ ఆర్డీఓ బాలకృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement