కృష్ణాజిల్లా
న్యూస్‌రీల్
భోజన నాణ్యత డొల్ల వసతులపై విమర్శల వెల్లువ పర్యవేక్షణ లేక విద్యార్థుల అవస్థలు ఎన్టీఆర్ జిల్లాలో వివిధ శాఖల కింద 65 హాస్టళ్లు వసతి పొందుతున్న సుమారు ఎనిమిది వేల మంది విద్యార్థులు
శుక్రవారం శ్రీ 27 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
సర్కారు నిర్లక్ష్యంతో వసతి గృహాల్లో సంక్షోభం
7
లబ్బీపేట: ఎన్టీఆర్ జిల్లా మలేరియా అధికారిగా డాక్టర్ రాజునాయక్ నియమితులయ్యారు. గుంటూరులో బయాలజిస్ట్‌గా పని చేస్తున్న ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించి, డీఎంహెచ్‌ఓ సుహాసినీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి ఉయ్యూరుకు చెందిన భక్తురాలు చెందిన పొవూరి పద్మజ రూ. 1,08,116 విరాళాన్ని అందజేశారు.
హాస్టల్స్ నిర్వహణలో ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వార్డెన్లు అందుబాటులో ఉండటం లేదు. అలాగే విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన ఆహారంలోనూ కోతలు విధిస్తూ వారి పొట్టలు కొడుతున్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు తప్ప మిగిలిన సమయంలో ఆయా హాస్టళ్లను సందర్శించేవారు గానీ, పట్టించుకునే వారు కానీ ఉండటం లేదు. హాస్టళ్లలో అరకొర వసతులతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికై నా వాటిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలి.
– సీహెచ్ వెంకటేశ్వరరావు,
జిల్లా కార్యదర్శి, ఎస్‌ఎఫ్‌ఐ
మంగళగిరి టౌన్: విజయవాడ ప్రసాదంపాడుకు చెందిన అజయ్‌కుమార్ (48) ఈనెల 23వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం 24వ తేదీన తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అజయ్‌కుమార్‌కు బ్రెయిన్‌లో రక్తస్రావం అయ్యిందని, ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో 25వ తేదీన వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించారు. కుటుంబ సభ్యులు అజయ్‌కుమార్ అవయవాలు దానం చేసేందుకు గురువారం ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ జీవన్‌దాన్ చైర్మన్ కె. రాంబాబు, హాస్పిటల్ డైరెక్టర్ రామాంజనేయరెడ్డి ఆధ్వర్యంలో కాలేయం, కిడ్నీ మణిపాల్ హాస్పిటల్‌కు, మరొక కిడ్నీని విజయవాడ కామినేని హాస్పిటల్‌కు, కార్నియాను విజయవాడ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించారు. మణిపాల్‌లో అవసరమైన వారికి కాలేయం, కిడ్నీ ప్లాంటేషన్ నిర్వహించారు. అవయవదానానికి ముందుకు వచ్చిన అజయ్‌కుమార్ కుటుంబసభ్యులను మణిపాల్ ఆసుపత్రి యాజమాన్యం అభినందించి, కృతజ్ఞతలు తెలిపింది.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్(ఏజీ) దుమ్మాలపాటి శ్రీనివాస్ కుటుంబం గురువారం రాత్రి దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్‌ను ఆలయ ఏసీ రంగారావు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు నిర్లక్ష్యం నీడలో కొట్టుమిట్టాడుతున్నాయి. సమాజంలో వెనుకబాటును ఎదుర్కొంటున్న వర్గాలకు చెందిన పిల్లలు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్లటానికి హాస్టళ్లు బాసటగా ఉండాల్సి ఉంది. కానీ అందుకు భిన్నమైన పరిస్థితులు జిల్లాలోని హాస్టళ్లలో దర్శనమిస్తున్నాయి. అన్ని వసతులు కల్పించి విద్యార్థులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేస్తుండటంతో వాటి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో హాస్టళ్లు ఎలుకలకు ఆవాసాలుగా మారాయంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ప్రతి హాస్టల్‌లోనూ ఏదో ఒక సమస్య వెంటాడుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడని విద్యార్థి సంఘాల నేతలు విమర్శిస్తున్నారు
జిల్లాలో పరిస్థితి..
జిల్లా వ్యాప్తంగా 65 హాస్టళ్లు వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతుండగా అందులో సుమారు ఎనిమిది వేల మంది విద్యార్థులు వసతి పొందుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 34 హాస్టళ్లు, వెనుకబడిన తరగుతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 36, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మూడు, మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెండు చొప్పున హాస్టళ్లు పని చేస్తున్నాయి. అయితే వీటిల్లో సగానికి పైగా హాస్టళ్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఆయా హాస్టల్స్‌లో వసతి పొందుతున్న వేలాది మంది విద్యార్థులు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా కేజీబీవీల్లోనూ సమస్యలు తాండవిస్తున్నాయి.
80 శాతానికి పైగా అసంతృప్తి..
జిల్లాలోని పలు హాస్టళ్లపై భారీగా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇటీవల పలు దఫాలుగా ఐవీఆర్‌ఎస్ సర్వేలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 80 శాతానికి పైగా విద్యార్థులు తమ హాస్టల్స్‌లో వసతులు దారుణంగా ఉన్నాయని విమర్శలు చేశారు. అలాగే హాస్టల్ వార్డెన్లు సైతం నియమనిబంధనల ప్రకారం ఉండాల్సిన సమయాల్లో ఉండటం లేదనే విషయాన్ని సైతం వివరించారు. వీటిపై మంత్రి ఆదేశాలతో నియమించిన అధికారులు వెళ్లి చూడగా ఆ సమయంలోనూ వార్డెన్లు లేక పోవటం, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవటం అంశాలపై వాటి తీరుతెన్నులను స్పష్టం చేస్తున్నాయి.
భోజన మెనూ మరీ దారుణం..
జిల్లాలోని ఆయా సంక్షేమ హాస్టళ్లలో మెనూ అమలు పరిస్థితి మరింత దారుణంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల ఫుడ్ కమిషన్ చైర్మన్ సైతం పలు హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించినప్పుడు వాటి పరిస్థితి బయటపడింది. చాలా హాస్టళ్లలో ఒక కూరతోనే సరిపెడుతున్న పరిస్థితి ఉంది. చాలా హాస్టళ్లలో పాలు, పెరుగు వారంలో ఒకటి రెండు రోజులకు పరిమితమవుతున్నాయి. కూరల పంపిణీలోనూ దోపిడీ జరుగుతోంది. ఫిర్యాదు చేస్తే ఎవరు తమను ఏమి అంటారో అనే భయంతో బిక్కుబిక్కుమంటూ విద్యార్థులు కాలం గడుపుతున్న పరిస్థితులు ఉన్నాయి.
హాస్టళ్లపై పర్యవేక్షణ శూన్యం..
జిల్లాలో ఉన్న హాస్టళ్లకు సంబంధించి నిరంతర పర్యవేక్షణ అవసరం. కానీ ఉన్నతాధికారులెవరూ వాటిపై దృష్టి సారించకపోవటంతో వేలాది మంది విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హాస్టళ్లపై అసలు నిఘా కరువైందనే విమర్శలు ఉన్నాయి. అందువల్లే విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు ఆయా వస్తువులను పంపిణీ చేసే కాంట్రాక్టర్ల నుంచి మామూళ్లను తీసుకోవటంలో ఉన్న శ్రద్ధ హాస్టల్స్‌లో ఏమి జరుగుతుందనే విషయాలను తెలుసుకోవటంలో చూపటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులెవరూ హాస్టల్స్‌పై నిఘా పెట్టకపోవటంతో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా


