లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
వేదాద్రి(జగ్గయ్యపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు స్వామివారి ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్ర పటం అందజేశారు. కార్యక్రమంలో జగ్గయ్యపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి హిమబిందు, ఎస్‌ఐ తోట సూర్య శ్రీనివాస్, విశ్వభారతి కళాశాల చైర్మన్ కొమరగిరి పద్మావతి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


