మార్చి 6న లెజిస్లేటివ్‌ స్పోర్ట్స్‌ మీట్‌ విజేతలకు బహుమతుల ప్రదానం | - | Sakshi
Sakshi News home page

మార్చి 6న లెజిస్లేటివ్‌ స్పోర్ట్స్‌ మీట్‌ విజేతలకు బహుమతుల ప్రదానం

Feb 28 2026 7:42 AM | Updated on Feb 28 2026 7:42 AM

మార్చ

మార్చి 6న లెజిస్లేటివ్‌ స్పోర్ట్స్‌ మీట్‌ విజేతలకు బహుమ

మార్చి 6న లెజిస్లేటివ్‌ స్పోర్ట్స్‌ మీట్‌ విజేతలకు బహుమతుల ప్రదానం మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం, దండమూరి రాజగోపాలచారి ఇండోర్‌ స్టేడియం ఆవరణలో ఈ నెల 24, 25, 26 తేదీల్లో జరిగిన లెజిస్లేటివ్‌ స్పోర్ట్స్‌ మీట్‌–2026లో విజేతలకు మార్చి 6వ తేదీన అమరావతిలో బహుమతులను అంద జేస్తామని ఆంధ్రప్రదేశ్‌ క్రీడాప్రాధికార సంస్థ (శాప్‌) చైర్మన్‌ ఏ.రవినాయుడు చెప్పారు. స్టేడియం ఆవరణలో ఉన్న శాప్‌ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొత్తం 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించగా.. ప్రజా ప్రతినిధులందరూ ప్రొఫెషనల్‌ క్రీడాకారుల్లా ఆడారని చెప్పారు. 6న అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేస్తామని చెప్పారు. అదేవిధంగా మార్చి 4న స్టేడియం అభివృద్ధికి సంబంధించిన టెండర్‌ ప్రక్రియ పూర్తవుతుందని రవినాయుడు చెప్పారు. మార్చిలో విశాఖపట్నంలో సీనీ హీరోలు, ఎమ్మెల్యేల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించనున్నామన్నారు. కార్యక్రమంలో శాప్‌ డైరెక్టర్లు సంతోష్‌కుమార్‌, జగదీశ్వరి, రజని సమావేశంలో పాల్గొన్నారు. 4వేల కిలోల ప్లాస్టిక్‌ సీజ్‌ పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు శుక్రవారం సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ బ్యాన్‌పై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. నగర పరిధిలోని అన్ని డివిజన్లలో 4000కిలోల ప్లాస్టిక్‌ని సీజ్‌ చేశారు. ఈ మేరకు విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్‌ మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కె.అర్జునరావు మాట్లాడుతూ నగర పరిధిలో ఉన్న అన్ని షాపుల్లో శానిటరీ సూపర్‌ వైజర్‌, ఇన్‌స్పెక్టర్లు, సెక్రటరీలు నగరంలోని మూడు సర్కిల్‌ పరిధిలోని షాపులను తనిఖీలు చేశారని చెప్పారు. ఆయా షాపుల్లో నిల్వ ఉంచిన సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ని సీజ్‌ చేసి రూ.3లక్షల జరిమానా విధించామని తెలిపా రు. 37వ డివిజన్లో వారికి 120 మైక్రాల కన్నా మందం తక్కువ గల క్యారీ బ్యాగులు వాడుతున్నందుకు సుమారు 250 కేజీ కవర్లు సీజ్‌ చేసి వారి నుంచి రూ.1,80,000 వసూలు చేశామని పేర్కొన్నారు. పర్యావరణహితమైన వస్తువులే వాడాలని, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ వస్తువుల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. అనంతరం ప్రజలకు, వినియోగదారులకు, అమ్మేవారికి, ప్రజారోగ్యం సిబ్బంది అవగాహన కల్పించారు. ఆయేషామీరా అవశేషాలు తల్లిదండ్రులకు అప్పగింత బాపులపాడు డెప్యూటీ ఎంపీడీవోపై సస్పెన్షన్‌ వేటు

విజయవాడలీగల్‌: ఆయేషా మీరా అవశేషాలను ఆమె తల్లిదండ్రులకు విజయవాడలోని సీబీఐ న్యాయస్థానం శుక్రవారం అప్పగించింది. తెనాలిలో అవశేషాలను ఖననం చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం కోర్టు ప్రాంగణం నుంచి ర్యాలీగా బయలుదేరిన ఆయేషా మీరా తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని, నేరుగా తెనాలి తీసుకు వెళ్లాలని పోలీసులు సూచించారు. న్యాయ స్థానం బయట ఆమె తల్లి సంషాద్‌ బేగం విలేకర్లతో మాట్లాడుతూ.. ‘నా బిడ్డను అన్యాయంగా చంపేశారు. 18 ఏళ్లుగా పోరాటం చేసినా న్యాయం జరగలేదు, న్యాయం కోసం మేం తిరుగుతుంటే.. దోషులు మాత్రం దర్జాగా జల్సాలు చేశారు. ఆ దేవుడే దోషులను కఠినంగా శిక్షంచాలని వేడుకుంటున్నాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ కూడా ఆయేషా మీరా హత్య కేసులో నిందితుడిని తేల్చలేదని.. తమకు అన్యాయం చేశారని ఆరోపించారు. పేదవారికి న్యాయం జరగడం లేదని వాపోయారు. ఈ కేసుకు సంబంధించిన అన్నీ ఆధారాలున్నా.. వాటిని తుడిచేశారన్నారు.

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ బాపులపాడు డెప్యూటీ ఎంపీడీవో కె.లక్ష్మయ్యపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారి జె.అరుణ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటి పన్ను వసూళ్లలో పురోగతి సాధించకపోవటం, శాఖాపరమైన సమీక్ష సమావేశాలకు గైర్హాజరు కావటంతో డెప్యూటీ ఎంపీడీవో కె.లక్ష్మయ్యపై ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. ఇంటి పన్ను బకాయిల వసూళ్లలో జిల్లాలోనే అట్టడుగు స్థానంలో బాపులపాడు మండలం ఉండటం, నిర్ణీత లక్ష్యాల మేరకు వసూళ్లు చేయటంపై దృష్టి పెట్టకపోవటమే కాక రక్షిత తాగునీటి సరఫరా, ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను శుభ్ర పర్చటం, క్లోరినేషన్‌ పనుల్లోనూ తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించటంతో కలెక్టర్‌ డీకే బాలాజీ ఆదేశాల మేరకు బాపులపాడు డెప్యూటీ ఎంపీడీవో కె.లక్ష్మయ్యను సస్పెండ్‌ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి జె.అరుణ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మార్చి 6న లెజిస్లేటివ్‌ స్పోర్ట్స్‌ మీట్‌ విజేతలకు బహుమ1
1/1

మార్చి 6న లెజిస్లేటివ్‌ స్పోర్ట్స్‌ మీట్‌ విజేతలకు బహుమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement