ఇంటర్ పరీక్షలు ప్రారంభం
మచిలీపట్నంఅర్బన్: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు కృష్ణాలో ప్రశాంత వాతావరణంలో సోమవారం ప్రారంభమైనట్లు జిల్లా ఇంటర్మీడియెట్ పరీక్షల అధికారి ఎస్.సరళకుమారి తెలిపారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, పరీక్షలు సజావుగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 23 నుంచి మార్చి 24వ తేదీ వరకూ పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 23,396 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు నమోదు కాగా, వారిలో 22,936 మంది పరీక్షలకు హాజరయ్యారని 460 మంది గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం హాజరు 98 శాతం నమోదైందన్నారు. జిల్లాలో 63 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పోలీసు శాఖ ఆయా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు చేపట్టింది. విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకునేలా, పరీక్ష నియమాలు కచ్చితంగా పాటించేలా అధికారులు ఆదేశించారు. పరీక్షల పర్యవేక్షణకు మూడు సిట్టింగ్ స్క్వాడ్లు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. ఈ రోజు నిర్వహించిన పరీక్షకు సెట్–1 ప్రశ్నపత్రాన్ని వినియోగించినట్లు పరీక్షల అధికారి తెలిపారు.
జిల్లాలో 98 శాతం హాజరు
ఇంటర్ పరీక్షలు ప్రారంభం


