వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్య
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో హిజ్రా ఆత్మహత్యపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో బ్లాక్ నంబర్ 135లో అబ్దుల్ రషీద్ కుటుంబం నివాసం ఉంటుంది. రషీద్‌కు కుమారుడు, కుమార్తె సంతానం. కుమారుడు అబ్దుల్ రెహమాన్ 12 ఏళ్ల కిందట ఇంటి నుంచి వెళ్లి పోయి కాలనీలో 45వ బ్లాక్‌లో ఉంటున హిజ్రాలతో కలిసి ఉంటున్నాడు. కొన్నేళ్లుగా రెహమాన్ అంజలిగా పేరు మార్చుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం రషీద్ భార్యకు రెహమాన్ స్నేహితులు ఫోన్ చేసి రెహమాన్ వాళ్ల ఇంట్లో ఉరి వేసుకున్నాడని తెలిపింది. దీంతో హుటాహుటినా వారు రెహమాన్ ఇంటికి వెళ్ల చూడగా ఉరికి వేలాడుతుండగా కిందకు దింపి ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలోనే మృతి చెందాడు. ఘటనపై మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.
జి.కొండూరులో బాలిక..
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ఆదివారం పలువురు భక్తులు విరాళాలు అందజేశారు. హైదరాబాద్ సంజీవరెడ్డి నగర్‌కు చెందిన జె.కిషోర్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.5 లక్షల విరాళాన్ని అందచేశారు. కృష్ణాజిల్లా గన్నవరానికి చెందిన మోచర్ల భవానీ కుటుంబం రూ.1,01,116, విజయవాడ లయోలా కాలేజీ ప్రాంతానికి చెందిన తన్నీరు మారుతీ ఫణికాంత్ రూ.లక్ష విరాళాన్ని అందించారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు, అర్చకులు అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్య


