చైన్‌ స్నాచర్‌గా మారిన లైన్‌మన్‌ | - | Sakshi
Sakshi News home page

చైన్‌ స్నాచర్‌గా మారిన లైన్‌మన్‌

Feb 26 2026 9:27 AM | Updated on Feb 26 2026 9:27 AM

చైన్‌

చైన్‌ స్నాచర్‌గా మారిన లైన్‌మన్‌

చైన్‌ స్నాచర్‌గా మారిన లైన్‌మన్‌ తిరువూరు: విజయవాడలో అసిస్టెంట్‌ లైన్‌మెన్‌గా పనిచేస్తూ చోరీ లకు పాల్పడుతున్న నంద సుభాష్‌ను తిరువూరు పోలీసులు చైన్‌ స్నాచింగ్‌ కేసులో బుధవారం అరెస్టు చేశారు. సీఐ గిరిబాబు కథనం మేరకు.. తిరువూరు మండలం చిక్కుళ్లగూడెంలో ఈ నెల 13న ఇంటిలో ఒంటరిగా ఉన్న ఉప్పు అనసూయను ఓ వ్యక్తి మంచినీరు కావాలనే నెపంతో ఇంట్లోకి ప్రవేశించి, ఆమైపె దౌర్జన్యం చేసి మెడలోని 40 గ్రాముల బంగారు నానుతాడు తస్కరించి ద్విచక్రవాహనంపై పరారయ్యాడు. అనసూయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరిపి సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడు విజయవాడ సీతారాంపురంలో నివసించే నంద సుభాష్‌బాబుగా గుర్తించారు. అతను లైన్‌మన్‌గా పనిచేస్తున్నట్లు నిర్ధారించారు. బుధవారం లక్ష్మీపురం వద్ద జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా వెళుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. అతడి నుంచి బంగారు గొలుసుతో పాటు ద్విచక్రవాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. వ్యసనాలకు బానిసైన నిందితుడు నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. గతంలో కూడా సుభాష్‌పై పలు కేసులున్నాయని, నిందితుడ్ని అరెస్టు చేసి తిరువూరు కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్‌ రిమాండ్‌కు ఆదేశించారని తెలిపారు. యువకుడి ఆత్మహత్య గుడివాడరూరల్‌: తీవ్రమైన తలనొప్పి తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మల్లాయపాలెం పరిధిలో ఉన్న టిడ్కో సముదాయంలో బుధవారం జరిగింది. గుడివాడ తాలూకా పోలీసుల కథనం మేరకు.. టిడ్కో సముదాయంలో నివసిస్తున్న అందే మల్లేశ్వరరావు కుమారుడు నాగసతీష్‌కుమార్‌ (28) కొన్ని రోజులుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ ఏలూరులో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం తలనొప్పి తీవ్రంగా ఉందని తల్లిదండ్రులకు చెప్పాడు. వారు అతడిని ఏలూరు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుండగా నాగసతీష్‌కుమార్‌ టిడ్కో అపార్టుమెంట్‌పైకి వెళ్లి అక్కడ నుండి కిందకు దూకేశాడు. తీవ్రంగా గాయపడి అతడిని తల్లిదండ్రులు, స్థానికులు హుటాహుటిన గుడివాడలోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సతీష్‌కుమార్‌ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎన్‌.చంటిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 122 మొబైల్‌ ఫోన్లు రికవరీ

లబ్బీపేట(విజయవాడతూర్పు): వేర్వేరు ప్రాంతాల్లో చోరీ అయిన, పోగొ ట్టుకున్న 122 ఫోన్‌లను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రికవరీ చేశారు. వాటిని బుధవారం తిరిగి బాధితు లకు అందజేశారు. ఈ సందర్భంగా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సైబర్‌ క్రైమ్‌ డీసీపీ కృష్ణప్రసన్న మాట్లాడుతూ.. పలువురు పోగొట్టుకున్న, కొందరి నుంచి చోరీకి గురైన మొబైల్‌ ఫోన్‌లను ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబు ఆదేశాల మేరకు సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌(సీఈఐఆర్‌) ద్వారా రికవరీ చేసినట్లు తెలిపారు. రికవరీ చేసిన 122 ఫోన్‌లను బాధితులకు అందించారు. ఇప్పటి వరకూ ఏడు విడతల్లో రూ.18 లక్షల విలువగల 2,468 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించినట్లు తెలిపారు. ప్రజలు మొబైల్‌ పోయిన వెంటనే సీఈఐఆర్‌ సేవలను వినియోగించాలన్నారు. సైబర్‌ మోసాలకు గురైనప్పుడు ఆలస్యం చేయ కుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ బి.రాజశేఖర్‌, ఇన్‌స్పెక్టర్లు దుర్గాప్రసాద్‌, శ్రీను, శ్రీనివాస్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

చైన్‌ స్నాచర్‌గా మారిన లైన్‌మన్‌ 
1
1/2

చైన్‌ స్నాచర్‌గా మారిన లైన్‌మన్‌

చైన్‌ స్నాచర్‌గా మారిన లైన్‌మన్‌ 
2
2/2

చైన్‌ స్నాచర్‌గా మారిన లైన్‌మన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement