రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
గుడ్లవల్లేరు: రైలు ఢీ కొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే పోలీసులు చెప్పిన వివరాల మేరకు గుడ్లవల్లేరు నుంచి కౌతవరం వైపు రైలు వస్తుండగా పుల్లేరు కాలువ వంతెనపై గల రైలు పట్టాలు దాటుతున్న వ్యక్తిని రైలు ఢీకొట్టింది. 55 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీకొనగా కీ మ్యాన్ సంఘటనా స్థలానికి వెళ్లి మృతుడు మరణించినట్లు నిర్ధారించారు. ఈ ఫిర్యాదుపై మచిలీపట్నం ఆర్పీఓ పీహెడ్ కానిస్టేబుల్ ఏఎస్ కుమార్‌చే మచిలీపట్నం ఆర్పీ ఎస్‌ఐ కే శివన్నారాయణ ఉత్తర్వులపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రపరిచి మృతుని ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుని వద్ద నేవీ బ్లూ రంగు షర్టు, కాషాయం రంగు టవల్ ఉన్నాయి. మృతుని ఆచూకీ తెలిసినవారు 98495 96079 నంబర్‌కు సంప్రదించాలని రైల్వే పోలీసులు కోరారు.
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ట్రాఫిక్ నియంత్రణ కోసం రోడ్డుపై ఉంచిన బారికేడ్‌ను ఢీకొని ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం చెందిన ఘటన కొండపల్లిలో 30వ నంబర్ జాతీయ రహదారిపై డీఏవీ పాఠశాల సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు కొండపల్లి వడ్డేనగర్‌కు చెందిన ఏసుబాబు(60) వ్యక్తిగత పనులపై ఇబ్రహీంపట్నం వెళ్లి తిరుగు ప్రయాణంలో ఇంటికి వస్తున్నాడు. లారీ వెనుక వెళ్తున్న ఏసుబాబుకు దగ్గరకు వచ్చే వరకు బారీకేడ్ కనిపించలేదు. కూతవేటు దూరంలో బారికేడ్ కనిపించడంతో అప్పటికే అదుపు తప్పిన బైక్ బారికేడ్‌ను ఢీకొట్టింది.
బారికేడ్ కింద పడిన ఏసుబాబును చూసిన స్థానికులు చేరుకుని 108 సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది వైద్య పరీక్షలు జరిపి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. నెల రోజుల వ్యవధిలో ఇదే ప్రాంతంలో రెండు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి


