‘ కృష్ణా జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటాం’ | Telangana Minister Uttam Kumar Vows Efficient Use Of Krishna Waters, Promises Palamuru Projects Completion By 2028 | Sakshi
Sakshi News home page

‘ కృష్ణా జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటాం’

Mar 8 2026 6:42 PM | Updated on Mar 8 2026 7:03 PM

Minister Uttam Kumar Vows Efficient Use of Krishna Waters

హైదరాబాద్‌: ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టుల పనులపై సమీక్ష చేశామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో సీఎం రేవంత్‌ నాయకత్వంలో కృష్ణా జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్‌.  ఆ నీటిని ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాలకు అందిస్తామన్నారు.  

ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి తెలంగాణ ఏర్పడిన తర్వాత అత్యదిక వరి సాగు ఈ ఖరీఫ్ పంటలో వచ్చింది. కృష్ణా, గోదావరి బేసిన్‌లలో అత్యధిక సాగు పంటలు పండాయి. ఇరిగేషన్ విషయంలో ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం. అన్ని ప్రాజెక్టులపై రివ్యూ చేశాం. ప్రాజెక్టులకు భూ సేకరణను జూన్ 2 లోపు 5 వేల కోట్ల తో కంప్లిట్ చేస్తాం. పాలమూరు - రంగా రెడ్డి ప్రాజెక్టుకు నిధుల అంశాన్ని చర్చించాం. 

పాలమూరు ను 90 శాతం చేశామని గత పాలకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రూ. 55 వేల కోట్ల ప్రాజెక్టులో రూ. 27 వేల కోట్లు ఖర్చు చేస్తే అది 90 శాతం అయినట్ల..?, వారి హయాంలో నే పాలమూరు అంచనాలు రూ. 84 వేల కోట్లకు పెంచారు. రూ. 27 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి నీరు ఇవ్వలేదు.పాలమూరు ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలంకు షిఫ్ట్ చేయడం వల్ల తీరని అన్యాయం జరిగింది. 2028 డిసెంబర్ లోపు అన్ని ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తాం’ అని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement